పసిడి ప్రియులకు షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే ?

By asianet news teluguFirst Published Dec 3, 2022, 10:18 AM IST
Highlights

ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.49,250కి చేరింది.  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  రూ.550 పెరిగి రూ.53,730 వద్ద ఉంది. 

శుభకార్యాలకు అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో కావడంతో  బంగారం, వెండి  కొనాలనుకునే వారికి ముఖ్యమైన వార్తా. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో  గత కొన్ని రోజులుగా పసిడి ధర నిరంతరం పెరుగుతోంది. ఈ వారంలో ఐదో రోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. 

శనివారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు మారాయి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 53,730 వద్దకు చేరింది. ఇదిలా ఉంటే, వెండి ధరలు కూడా కిలోకు రూ.700 పెరిగి రూ.64,300కి చేరుకున్నాయి.

ఒక నివేదిక ప్రకారం, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 500 పెరిగి రూ.49,250 వద్ద ట్రేడవుతోంది.ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ. 53,730, 22 క్యారెట్లకు రూ. 49,250 వద్ద చేరింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,900, 22 క్యారెట్ల ధర రూ. 49,400 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,760,  22 క్యారెట్ల ధర రూ.50,200గా ఉంది.  

స్పాట్ బంగారం 2:21 pm ET (1921 GMT) సమయానికి ఔన్స్‌కు 0.4% పడిపోయి $1,794.96డాలర్లకి పడిపోయింది, అంతకుముందు ఆగస్ట్ 10 నుండి $1,804.46 డాలర్ల వద్ద అత్యధికంగా నమోదైంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి $1,809.6 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.43 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,300గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.71,000 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.49,250కి చేరింది.  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  రూ.550 పెరిగి రూ.53,730 వద్ద ఉంది. 

బంగారం కొనడంలో 
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెళ్లిళ్ల సీజన్ ఇంకా చాలా ఉంది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల దశ కొనసాగుతుంది. అలాగే, త్వరలో కొత్త సంవత్సరం 2023లో బంగారం ధర గరిష్ట స్థాయికి సమీపంలో లేదా అంతకంటే ఎక్కువ చేరుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు  శుభకార్యాలకు బంగారం కొనాలని ఆలోచిస్తే  వీలైనంత త్వరగా కొనడం ద్వారా మీరు కొంత ప్రయోజనం పొందవచ్చు అని సుచిస్తున్నారు.

అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు పెరుగుతుండగా  మరికొన్నిసార్లు పడిపోతున్నాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తుందోనన్న దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు ఉన్నారు. 

బంగారం స్వచ్ఛతను ఇలా చెక్ చేసుకోండి
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌లు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారానికి 999, 23 క్యారెట్‌కి 958, 22 క్యారెట్‌కి 916, 21 క్యారెట్‌కి 875, 18 క్యారెట్‌కి 750. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా వికయిస్తున్నారు.

click me!