అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల, రూ. 74,142 కోట్లకు చేరిన ఎల్‌ఐసీ పెట్టుబడి..

By Krishna AdithyaFirst Published Dec 3, 2022, 12:33 AM IST
Highlights

అదానీ గ్రూప్ కు చెందిన ఏడు కంపెనీల్లోని ఎల్‌ఐసి వాటా మొత్తం విలువ రూ. 74,142 కోట్లు. అంటే అదానీ గ్రూప్ రూ. 18.98 లక్షల కోట్లు మొత్తం మార్కెట్ విలువలో 3.9 శాతంతో సమానం. 

అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి రెండేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది, రూ. 74,142 కోట్లను అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడి పెట్టింది అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అదానీ గ్రూపులోని  ఏడు కంపెనీల్లోని ఎల్‌ఐసి వాటా మొత్తం విలువ రూ. 74,142 కోట్లుగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ అదానీ గ్రూప్ రూ. 18.98 లక్షల కోట్లు కాగా, మొత్తం మార్కెట్ విలువలో ఎల్ఐసీ వాటా 3.9 శాతంగా ఉంది. 

ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులను నిరంతరం పెంచుతోంది. తాజాగా అదానీ గ్రూపు కంపెనీలు స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి రెండేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది, రూ.  74,142 కోట్లను ఎల్‌ఐసీ పెట్టుబడి పెట్టినట్లు తేలింది.  సెప్టెంబర్ 2020 నుండి కేవలం ఎనిమిది త్రైమాసికాల్లో, లిస్టెడ్ ఏడు అదానీ గ్రూప్ కంపెనీల్లో నాలుగింటిలో ఎల్‌ఐసి తన వాటాను వేగంగా పెంచుకుంది.

అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ వాటా 3.9 శాతం
అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం అదానీకి చెందిన ఏడు కంపెనీల్లోని ఎల్‌ఐసి వాటా మొత్తం విలువ సుమారుగా రూ. 74,142 కోట్లు. ఇదిలా ఉంటే అదానీ గ్రూప్ విలువ రూ. 18.98 లక్షల కోట్లు కాగా, మొత్తం మార్కెట్ విలువలో ఎల్ఐసీ వాటా 3.9 శాతం కావడం గమనార్హం. 

అదానీ గ్రూపులో ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజ్‌లో ఎల్‌ఐసి వాటా సెప్టెంబర్ 2020లో 1 శాతం కంటే తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు 4.02 శాతానికి పెరిగింది. అదే సమయంలో, సెప్టెంబర్ 2020లో అదానీ టోటల్ గ్యాస్‌లో LIC వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది, ఇది ఇప్పుడు 5.77 శాతానికి పెరిగింది.

సెప్టెంబర్ 2020, సెప్టెంబర్ 2022 మధ్య, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో LIC వాటా 2.42 శాతం నుండి 3.46 శాతానికి పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో సెప్టెంబర్ 2020లో 1 శాతం కంటే తక్కువగా ఉండగా, ఇప్పుడు అది 1.15 శాతానికి పెరిగింది.

click me!