బంగారం వెండి ధరల అప్ డేట్: పెరిగిన పసిడి.. కొనే ముందు నేటి కొత్త ధరలను తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Dec 29, 2022, 10:43 AM IST
Highlights

హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి, వెండి కూడా పసిడి ధరలను అనుసరిస్తుంది . ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం బంగారం యాభై వేల మార్క్‌ను దాటి కస్టమర్లను నిరాశపరుస్తుంది.  మన భారతీయ సంప్రదాయం ప్రకారం  మహిళలు బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో అస్థిరత కనిపిస్తోంది. ఈరోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా ఇంకా ముంబైలలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 200 పెంపుతో రూ. 50,300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 230 పెరుగుదలతో రూ.54,860 వద్ద ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.150 పెంపుతో రూ. 51,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెంపుతో రూ. 55,690గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,710. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,150,  24 క్యారెట్ల 10 గ్రాములకు  రూ.54,710గా ఉంది.  

బెంగళూరులో కేజీ  వెండి ధర  రూ. 74,600. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,600, కాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,300, ముంబైలో కిలో వెండి ధర రూ. 72,300, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 72,300గా ఉన్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి, వెండి కూడా పసిడి ధరలను అనుసరిస్తుంది . ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.  బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200  పెంపుతో రూ.50,150. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 230 పెంపుతో రూ. 54,710.

హైదరాబాద్‌లో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 200 పెంపుతో రూ. 50,150 . 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పెంపుతో రూ. 54,710.  కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,710. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,710. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది.

ఒక నివేదిక ప్రకారం, గ్లోబల్‌గా US డాలర్ మెత్తబడటంతో పసిడి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. గత సెషన్‌లో 1% పడిపోయిన తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2% పెరిగి $1,807.57కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% పడిపోయి $1,814.30కి చేరుకోగా, డాలర్ ఇండెక్స్ 0.2% పడిపోయింది.ఇక్కడ చూపిన అన్ని ధరలు మార్కెట్ ధరలను సూచిస్తాయి. మరింత ఖచ్చితమైన ధరల కోసం మీ సమీపంలోని నగల వ్యాపారిని సంప్రదించండి.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750.చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. బంగారం  క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 క్యారెట్ల అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారాకి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే దానితో  ఆభరణాలు  తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.
 

click me!