క్రూడాయిల్ ధరల్లో భారీ పతనం..! మీ నగరంలో నేడు పెట్రోల్-డీజిల్ ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి ?

By asianet news teluguFirst Published Dec 29, 2022, 9:29 AM IST
Highlights

దేశీయ మార్కెట్‌లో గత ఏడు నెలలుగా పెట్రోల్-డీజిల్ ధర ఒకే స్థాయిలో కొనసాగుతోంది. ఈరోజు అంటే గురువారం కూడా దేశవ్యాప్తంగా పెట్రోలు-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు ఈరోజు అంటే గురువారం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కాగా, ఈరోజు అంటే డిసెంబర్ 29, 2022న క్రూడాయిల్  ధరల్లో పతనం నమోదైంది. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $82.72 డాలర్లకు పడిపోయింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర గురించి మాట్లాడితే బ్యారెల్‌కు $78డాలర్లకు చేరింది.  

అయితే దేశీయ మార్కెట్‌లో గత ఏడు నెలలుగా పెట్రోల్-డీజిల్ ధర ఒకే స్థాయిలో కొనసాగుతోంది. ఈరోజు అంటే గురువారం కూడా దేశవ్యాప్తంగా పెట్రోలు-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ కంపెనీలు 29 డిసెంబర్ 2022న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేటికీ వరుసగా 217వ రోజు కావొస్తుంది.

ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు
ఈరోజు గురువారం దేశ రాజధాని ఢిల్లీలో గురువారం లీటరు పెట్రోలు ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.  చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.  కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76.

ఇతర నగరాల్లో ధరలు
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96. గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర రూ.90.05గా ఉంది. ఇది కాకుండా చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26. కాగా, లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర లీటరుకు రూ.89.76గా ఉంది. హైదరాబాద్లో  లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి, అలాగే విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL),  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL)  ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సమీక్షిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి  కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. ఆగస్ట్ 24న VATని పెంచినప్పుడు ఇంధన ధరలను అప్‌డేట్ చేసిన చివరి రాష్ట్రం మేఘాలయ.

click me!