బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. 50వేలకు చేరువలో పసిడి.. నేడు 10గ్రా., ఎంతంటే..?

By asianet news telugu  |  First Published Jan 20, 2022, 10:16 AM IST

నేడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. ఏంటంటే ఈ రోజు పసిడి ధరలు కాస్త ఎగిశాయి. దీంతో గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్నా బంగారం ధరలు(gold prices) ర్యాలీని కొనసాగించాయి. ఒక్కరోజులోనే పసిడి ధర పెరిగిపోయింది. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి కదులుతోంది. 
 


న్యూఢిల్లీ. నేడు గురువారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర  స్వల్పంగా పెరగగా, వెండి ధర 0.14 శాతం పెరిగింది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి దీని కారణంగా బంగారం ధర రూ.48,000 దాటింది. అలాగే నిన్న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.

దేశంలో పెళ్లిళ్ల సీజన్‌లో  రానుండటంతో ప్రజలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తారు. ఇలాంటి  పరిస్థితిలో పెరిగిన డిమాండ్ నుండి బంగారం-వెండి ధరలకు (గోల్డ్ సిల్వర్ ప్రైస్ అప్‌డేట్) మద్దతు లభిస్తుంది. చెప్పాలంటే  బంగారం మరోసారి నెమ్మదిగా 10 గ్రాముల ధర రూ.50,000 వైపు కదులుతోంది.  

Latest Videos

నేడు బంగారం-వెండి ధర స్వల్పంగా 0.01 శాతం పెరిగింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం 48,381 స్థాయిలో ఉంది. మరోవైపు వెండి కిలో 0.14 పెరిగి రూ.64,495 వద్ద ట్రేడవుతోంది. మీరు ఇంట్లో కూర్చొని పసిడి ధరలను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి దీంతో మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది, ఇందులో మీరు తాజా ధరలను చెక్ చేయవచ్చు.

 మీరు ఇప్పుడు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే, దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. 'బిఐఎస్ కేర్ యాప్'తో వినియోగదారులు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను సరిచూసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు.

ఈ యాప్‌లో వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్ అండ్ హాల్‌మార్క్ నంబర్ తప్పుగా గుర్తించినట్లయితే, కస్టమర్ వెంటనే దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా డాలర్‌ పెరుగుదల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తక్కువగా ఉండగా, లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత భారత్‌లో బంగారం ధర పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,250 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ. 51,500కు చేరింది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,430కు చేరగా,10 గ్రాముల  24 క్యారెట్ పసిడి ధర 49,560కు చేరింది. మరోవైపు చెన్నైలో ఈ ఉదయం బంగారం ధరలలో భారీగానే మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,430 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,560కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,200కు చేరింది.

హైదరాబాద్ మార్కెట్లో నేడు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200కు చేరింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్దాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయని గమనించాలి.

click me!