బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. నేడు హైదరాబాద్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

By asianet news teluguFirst Published Jan 20, 2023, 10:41 AM IST
Highlights

నేడు భారతదేశంలోని ప్రధాన నగరాలు బంగారం ధరలలో మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర  రూ.47,927గా ఉంది.

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే  శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో  బంగారం ధర తగ్గుతుందని సామాన్యులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని  బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

నేడు భారతదేశంలోని ప్రధాన నగరాలు బంగారం ధరలలో మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర  రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,890 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల రూ. 52,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 52,200. మరోవైపు  ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,730 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,000గా ఉంది.

చెన్నై, బెంగళూరు, కేరళ,  హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.73,500, పుణె, ముంబై, ఢిల్లీలో  కేజీ వెండి ధర రూ.71,900, కోల్‌కతాలో వెండి ధర కేజీకి  రూ.72,200.

వరుసగా 3 రోజులుగా బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1930 డాలర్లకి, స్పాట్ సిల్వర్ 24 డాలర్ల దిగువకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  ప్రస్తుతం రూ.81.26 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  నేడు స్థిరంగా రూ.52,000గా ఉంది.  24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు  రూ.56,730 వద్ద ఉంది.  

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,7860.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730.
పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730.

24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ బంగారం 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9 శాతం రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయినప్పటికీ, ఆభరణాలు చేయడానికి ఉపయోగించలేరు, కాబట్టి చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని విక్రయిస్తారు.

click me!