కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగోస్తున్న బంగారం వెండి ధరలు..

Ashok Kumar   | Asianet News
Published : Jan 03, 2022, 11:40 AM IST
కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగోస్తున్న బంగారం వెండి ధరలు..

సారాంశం

2022లో పెట్టుబడిదారులకు బంగారం ధరలు (gold prices)సానుకూలంగా తెరుచుకున్నాయి. నేడు బంగారం ధర 0.14 శాతం తగ్గి పది గ్రాముల బంగారం ధర  ఎం‌సి‌ఎక్స్ (MCX)లో రూ. 48,032కి చేరింది. దీంతో పాటు వెండి ధర కూడా 0.40 శాతం తగ్గి కిలోకి రూ.62,411కి తగ్గింది.

కొత్త సంవత్సరం 2022 మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం బంగారం, వెండి ధరలు ఊరటనిచ్చాయి. అంటే, మీరు కొత్త సంవత్సరంలో బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మంచి అవకాశం. నేడు బంగారం ధర 0.14 శాతం తగ్గి పది గ్రాముల బంగారం ధర MCXలో రూ. 48,032కి చేరింది. దీంతో పాటు వెండి ధర కూడా 0.40 శాతం తగ్గి కిలోకి రూ.62,411కి తగ్గింది.

గత  సంవత్సరం 2021 బంగారం, వెండి ధరలకి చాలా అస్థిర సంవత్సరం అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది మొదటిరోజు మాత్రం బంగారం, వెండి ధరలు సామాన్యులకు  ఉపశమనం కలిగించాయి. గత సంవత్సరం బంగారం ధరలో అతిపెద్ద పతనం (4 శాతం) నమోదైంది. దీంతో 10 గ్రాముల ధర రూ. 56,200 వద్ద ఆల్ టైమ్ హై ధర నుండి దాదాపు రూ.8000  దిగోచ్చింది.

ఆగస్ట్ 2020లో బంగారం ఆల్ టైమ్ హై 10 గ్రాముల ధర రూ.56200 స్థాయికి చేరుకుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.8127 తగ్గగా,  వెండి దాని ఆల్ టైమ్ హై ధర నుండి కిలోకు రూ. 1,8001 తగ్గింది. అంటే వెండి అత్యధికంగా కిలో ధర రూ.79980 తాకింది.

బంగారం, వెండి కొత్త ధరలు శని, ఆదివారాల్లో విడుదల కానందున ఈ రెండిటిని శుక్రవారం ధరలకే విక్రయిస్తారు. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.48083 (10 గ్రాములకు), 22 క్యారెట్ల బంగారం ధర రూ.44044 (10 గ్రాములకు), 18 క్యారెట్ల బంగారం ధర రూ.36062 (10 గ్రాములకు) వద్ద ఉంది.

also read కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ శుభారంభం.. లాభాల్లో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ..

శుక్రవారం బంగారం, వెండి ధర
అయితే, శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 285 పెరిగి  రూ. 48083 స్థాయికి చేరుకుంది. కిలో వెండి ధర రూ.846 పెరిగి రూ.61979కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,610 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,940.
 దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,160 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,160 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,600, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,740గా ఉంది. 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.47,160 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,860. 
కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,460 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,600గా ఉంది. 
కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,460,  24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 49,600గాఉంది. 
హైదరాబాద్‌లో  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,460 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,6గా ఉంది. 

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే