Gold Price: బంగారం ధర భారీగా పతనం, వెంటనే తులం పసిడి రేటు చెక్ చేసుకొని నగల షాపింగ్ కు బయలు దేరండి..

Published : Feb 15, 2023, 10:13 AM IST
Gold Price: బంగారం ధర భారీగా పతనం, వెంటనే తులం పసిడి రేటు చెక్ చేసుకొని నగల షాపింగ్ కు బయలు దేరండి..

సారాంశం

పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులకు రెక్కలు వచ్చినట్లు అయింది. పసిడి ధరలు గత వారం రోజులుగా గమనించినట్లయితే గరిష్ట స్థాయి నుంచి తగుముఖం పడుతున్నాయి.   

దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. గత కొద్ది వారాలుగా బంగారం, వెండి ధరలు పెరగడం పసిడి ప్రియులను షాక్ కు గురిచేసింది. ఈ రోజు అంటే బుధవారం బంగారం ఆభరణాల కొనుగోలు దారులకు  ఓ రిలీఫ్ వార్త వినిపించింది. గత మూడు రోజులుగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిజానికి బడ్జెట్ 2023 అనంతరం బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. దీని కారణంగా పసిడి ప్రేమికుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ రెండు లోహాలు భారతీయులకు చాలా సెంటిమెంటుతో ముడి పడి ఉన్నాయి. ఏ శుభకార్యమైనా సరే బంగారం లేకుండా జరగదు. భారతీయ వివాహాలలో బంగారు ఆభరణాలు అనేవి తప్పనిసరి. 

ఫిబ్రవరి 13 నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఆ తర్వాత బంగారం ధర 58 వేలు,  కిలోలు, వెండి 70 వేల దిగువకు దిగివచ్చాయి. తాజా అప్‌డేట్ ప్రకారం,  10 గ్రాముల బంగారం రూ. 57,400, వెండి కిలో రూ. 67,200 దిగువన ట్రేడవుతోంది. బుధవారం హైదరాబాద్ లో బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 57,305 వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.472 తగ్గింది. ఆ తర్వాత కేజీ వెండి రూ.66,705  వద్ద ముగిసింది. 

ఫిబ్రవరి 15 వ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర
>> 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ.57365కి చేరింది
>>22 క్యారెట్ల బంగారం ధర రూ.83 తగ్గి రూ.52546కి చేరింది
>> 18 క్యారెట్ల బంగారం ధర రూ.67 తగ్గి రూ.43024కి చేరింది 

బంగారం కొనుగోలు చేసే ముందు, దాని స్వచ్ఛతకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది.  ఒక గ్రాము తేడా వచ్చిన మీరు దాదాపు 6000 వరకు నష్టపోయే అవకాశం ఉంది అందుకే బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.   ముఖ్యంగా బంగారు నగలు కొనుగోలు చేసే సమయంలో తరుగు మజూరి విషయంలో  చాలా జాగ్రత్తగా ఉండాలి.  బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. బిఐఎస్ కేర్ యాప్ ద్వారా కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. 

అలాగే బంగారు నగలు కొనుగోలు చేసే సమయంలో నగల షాపు వారు ఇచ్చినటువంటి రసీదును చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఆ రసీదును మీరు సాక్ష్యంగా చూపే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !