Gold-Silver Price Today:స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు, ఉక్రెయిన్ సంక్షోభంతో పసిడి మార్కెట్ మరింత పైకి

Published : Mar 02, 2022, 10:23 AM IST
Gold-Silver Price Today:స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు, ఉక్రెయిన్ సంక్షోభంతో పసిడి మార్కెట్ మరింత పైకి

సారాంశం

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం (Russia-Ukraine War)ప్రభావం మెటల్స్ మార్కెట్ పై పడింది. దీంతో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తులం బంగారం ధర 50 వేలు దాటేసింది.  

Gold Rate Today 2 March 2022: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం (Russia-Ukraine War)ప్రభావం మెటల్స్ మార్కెట్ పై పడింది. దీంతో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.  భారతీయ బులియన్ మార్కెట్  తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం పది గ్రాముల 24 కేరట్ల బంగారం ధర 51 వేలకు చేరువైంది. అదే సమయంలో వెండి కిలో రూ.65 వేలు దాటింది. 
 
999 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.223 పెరిగింది. దీంతో క్రితం ట్రేడింగ్ రోజు పది గ్రాములకు రూ.50667 ఉన్న బంగారం ధర ఈరోజు రూ.50890కి చేరింది. వెండి కూడా ధర పెరిగింది.  999 స్వచ్ఛత కలిగిన ఒక కేజీ వెండి ధర 180 రూపాయలు పెరిగింది. 

నేటి బంగారం-వెండి ధర (Gold-Silver Price Today)
బంగారం, వెండి ధరలు రోజుకు రెండుసార్లు సవరిస్తారు. హైదరాబాద్ లో ఈ రోజు 24 కేరట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.50686కు అమ్ముడవుతుండగా, 22 కేరట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.46615గా ఉంది. 

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ibjarates.com, 995 స్వచ్ఛత కలిగిన బంగారం ధర నేడు రూ. 222 పెరిగింది. ఇది కాకుండా 916 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.204 పెరిగింది. 

నగల సమయంలో ధరలు భిన్నంగా ఉంటాయి
ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు కేవలం బంగారం స్వచ్ఛత ఆధారంగా  ధరను మాత్రమే సూచిస్తాయి. ఆభరణాల కొనుగోలులో ఇతర పన్నులు, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.  IBJA జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా స్వల్ప మార్పులతో ఉంటాయి. ఈ ధరలకు  GST జోడించలేదని గమనించాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు