
Petrol Diesel Price Today 2nd March:పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వారంలో మూడో రోజైన బుధవారం సైతం కాస్త ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు, రేట్లు తగ్గించలేదు, పెంచలేదు. ధరలో ఎలాంటి మార్పు లేకుండా ఇది వరుసగా 92వ రోజు కావడం విశేషం.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.41, డీజిల్ లీటర్ రూ.86.67గా నమోదైంది. అదే విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.104.67, డీజిల్ రూ.89.79. అదే సమయంలో చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది.
హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా నమోదైంది. అదే సమయంలో డీజిల్ ధర రూ.94.62 పలికింది. కరీంనగర్‌లో పెట్రోల్ - రూ.108.39, డీజిల్ - రూ.95.85, ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94, డీజిల్ - రూ.95.29, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69, డీజిల్ - రూ.94.14
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.96.56గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.75, డీజిల్ ధర రూ. 95.83గా ఉంది.
పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు ( How to check diesel petrol price daily.ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా మరియు BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPrice అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.