సంక్రాంతికి మళ్ళీ బంగారం ధర పెరగొచ్చు...ఎందుకింత డిమాండ్...?

By Sandra Ashok KumarFirst Published Jan 13, 2020, 10:44 AM IST
Highlights

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పై  మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

సంక్రాంతి సందర్భంగా బంగారం రేట్లు పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పై  మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బేజోస్ పర్యటనను వ్యతిరేకిస్తూ కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా (సెయిట్) సిద్ధమవుతుంది. అయితే సెయిట్ నిరసనలు ప్రభావం మార్కెట్ పై ప్రభావం చూపనున్నట్లు సమాచారం.

మార్కెట్ లో బంగారం రేట్లు నార్మల్ గా ఉన్నా..బేజోస్ రాకతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి.

ఇక ప్రస్తుతం మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.

also read ఇది సవాళ్ల బడ్జెట్.. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!!

నిన్న హైదరాబాద్ లో 1 గ్రాము 22క్యారెట్ల బంగారం ధర రూ.3820 ఉండగా ఈరోజు రూ.3821 గా ఉంది.

నిన్న హైదరాబాద్ లో 1 గ్రాము 24క్యారెట్ల బంగారం ధర రూ.4,025 ఉండగా ఈ రోజు రూ. 4,206 గా ఉంది.

 నిన్న మార్కెట్ లో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర  రూ.38,200 ఉంది. ఇవ్వాళ  38,210కి చేరింది. దీంతో 10గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గింది.

నిన్న 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర 42,050 ఉంటే అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.42,060 కి చేరింది. దీంతో నిన్నటి ఇవ్వాల్టికి రూ.10 వ్యత్యాసం కనిపిస్తోంది.

 విజయవాడ, విశాఖ లో పదిగ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడలో  22 క్యారెట్ల బంగారం రూ.38,210 ఉంటే  24 క్యారట్ల బంగారం ధర రూ. 42,060 ఉంది.

 వైజాగ్ లో 22క్యారెట్ల బంగారం ధర 38,210 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.42,060 ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.39,010, 24క్యారట్ల బంగారం ధర రూ. 42,210 ఉంది.

ఇక ఈరోజు వెండి ధరల విషయానికొస్తే

also read పైసల్లేక ఆర్బీఐపై ఒత్తిళ్లు.. అదనపు డివిడెండ్ కోసం కేంద్రం

1గ్రాము వెండి ధర రూ. 49.16
10గ్రాముల వెండి ధర రూ. 491.6
100 గ్రాముల వెండి ధర రూ. 4916
1000 గ్రాముల వెండి ధర రూ. 49,160 ఉంది.  

భారత్ బంగారానికి ఎందుకింత డిమాండ్

ఇదిలా ఉంటే భారత్ పై బంగారానికి ఎందుకింత డిమాండ్ ఉందనే అంశంపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలో మూడు కారణాల వల్లే బంగారానికి డిమాండ్ పెరిగినట్లు నివేదికలో పొందు పరిచారు. ముఖ్యంగా పెళ్లికోసం 24శాతం బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే పుట్టిన రోజు సందర్భంగా 15శాతం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. పండగల్లో సైతం బంగారాన్ని తక్కువగా కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. మతపరమైన వేడుకలు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వేడుకలకు సైతం 12శాతమే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు కౌన్సిల్ నివేదికలో పేర్కొంది.  
 

click me!