చుక్కలను చూపిస్తున్న బంగారం ధరలు... మరింత పెరిగే అవకాశం...

Ashok Kumar   | Asianet News
Published : Jan 06, 2020, 03:18 PM ISTUpdated : Jan 06, 2020, 04:07 PM IST
చుక్కలను చూపిస్తున్న బంగారం ధరలు... మరింత పెరిగే అవకాశం...

సారాంశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వన్ని బెదిరించడనికి జరిపిన డ్రోన్ స్ట్రైక్ లో  ఇరాక్‌ దేశానికి చెందిన ఇరాన్ మేజర్ జనరల్ ఖాసేం సోలైమాని హత్య జరిగింది. బంగారు ధరల పెరుగుదలకు  కూడా అదే కారణం అయ్యింది. గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1,800 రూపాయలు పెరిగింది.

 ఆసియాలో  ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున బంగారం ధర సోమవారం (జనవరి 6, 2020) 10 గ్రాములకి చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం  బంగారం ధర 41,000 రూపాయలకు చేరుకుంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు రూ .1,800 పెరిగింది.

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, యుద్ధల ముప్పు ఫలితంగా ప్రపంచ వాటా మార్కెట్లు, ముడి చమురు ధర పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరగడానికి దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం ఏడేళ్ల గరిష్టానికి చేరువగ ఉంది.

also read వరుసగా 4వ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమెరికా డ్రోన్ స్ట్రక్ లో ఇరాక్‌ దేశ మేజర్ జనరల్ ఖాసేం సోలైమాని హత్య జరిగింది. హత్య తరువాత ప్రతీకార దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రభుత్వన్ని బెదిరించడమే బంగారు ధరల పెరుగుదలకు అసలు కారణం. అంతేకాకుండా, యుఎస్-చైనా వాణిజ్య చర్చలలో ప్రతిష్ఠంభనలు పెట్టుబడిదారులకు బంగారంపైకి రావడానికి మరో కారణం అని కూడా తెలుస్తుంది.


 బిజినెస్ మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ అమిత్ సజేజాతో మాట్లాడుతూ బంగారు ధరల పెరుగుదల వెనుక కారణాలు తెలిపారు. "యుఎస్-చైనా వాణిజ్య చర్చల రెండవ రౌండ్లో బంగారు ధరల పెరుగుదల మరింత పురోగతి సాధించింది. కాబట్టి, బంగారం ధర ఔన్స్ కు $1610 నుండి $1630 వరకు పెరుగుతుందని మార్కెట్ అంచనా వేసింది, అయితే ఎంసిఎక్స్ వద్ద దేశీయ మార్కెట్లలో ఇది 10 గ్రాములకి రూ .41,000 ను తాకింది. "

also read 8న బ్యాంకులు, ఏ‌టి‌ఎంలు బంద్...ఎందుకంటే..?
ఇక భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని, 10 గ్రాములకి రూ .42 వేలకు కూడా చేరుకోవచ్చని సజేజా అభిప్రాయపడ్డారు.ఒక పత్రిక సమాచారం ప్రకారం, స్పాట్ బంగారం 1.7% పెరిగి  ఔన్స్ కు 1,577.98 డాలర్లకు చేరుకుంది. బంగారం ధర కూడా 1.8% పెరిగి 1,579.72 డాలర్లకు పెరిగింది.

 ఇది 10 ఏప్రిల్ 2013 నుండి అత్యంత అత్యధికం, యుఎస్ బంగారు ఫ్యూచర్స్ 1.8% పెరిగి 1,580.30 డాలర్లకు చేరుకుంది.అమెరికా, ఇతర విదేశీలను దేశం విడిచి వెళ్ళమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం కోరడంతో ఇరాక్‌పై ఆంక్షలు విధిస్తామని బెదిరించారు.

PREV
click me!

Recommended Stories

Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు
Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?