మళ్ళీ దిగోస్తున్న పసిడి ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత తగ్గిందటే..?

By asianet news teluguFirst Published Oct 26, 2022, 9:54 AM IST
Highlights

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్ళీ దిగోస్తున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా ధరలు రోజురోజుకి తగ్గుతూనే ఉన్నాయి.

న్యూఢిల్లీ : బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. బంగారం ధరలు నేడు బుధవారం అక్టోబర్ 26న తగ్గాయి. తాజా డేటా ప్రకారం, ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం నిన్న రూ. 4,701 నుండి నేడు రూ. 4,685 వద్ద, 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము నిన్న రూ.5,129గా ఉండగా నేడు రూ.5,111గా ఉంది. రానున్న రోజుల్లోనూ పసిడి ధర మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అని నిపుణులు భావిస్తున్నారు.

నేడు 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు     22-క్యారెట్    24-క్యారెట్  
చెన్నై         రూ.47,400    రూ.51,720
ముంబై      రూ.46,850    రూ.51,110
ఢిల్లీ           రూ.47,050    రూ.51,310
కోల్‌కతా     రూ.46,850    రూ.51,110
బెంగళూరు    రూ.46,900    రూ.51,160
హైదరాబాద్  రూ.46,850    రూ.51,110
నాసిక్        రూ.46,880    రూ.51,140
పూణే         రూ.46,880    రూ.51,140
అహ్మదాబాద్    రూ.46,900    రూ.51,160
లక్నో          రూ.47,050    రూ.51,310
చండీగఢ్    రూ.47,050    రూ.51,310
సూరత్       రూ.46,900    రూ.51,160
విశాఖపట్నం    రూ.46,850    రూ.51,110
భువనేశ్వర్  రూ.46,850    రూ.51,110
మైసూర్       రూ.46,900    రూ.51,160

0118 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్స్‌కు $1,653.06 వద్ద స్థిరంగా ఉంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,654.20 వద్ద ఉన్నాయి.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 58,000. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.63,500గా ఉంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 19.32 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త మెరుగుపడి ప్రస్తుతం రూ.82.55 వద్ద ఉంది.

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారానికి చెందినవి.  

click me!