Gold: బంగారం తరుగు, మజూరీ అంటే ఏంటి..నగల షాపుల వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోండి..

Published : Apr 19, 2023, 01:23 AM IST
Gold: బంగారం తరుగు, మజూరీ అంటే ఏంటి..నగల షాపుల వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోండి..

సారాంశం

బంగారం షాపులో మీరు బంగారం నగలు కొనుగోలు చేసినప్పుడు మీరు తరచూ  రెండు మాటలను వినే ఉంటారు అవి ఏంటంటే మజూరి,  రెండోది తరుగు.. ఇంతకీ తరుగు, మజూరి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సాధారణంగా నగల దుకాణాల్లో బంగారం నగలను తయారు చేసే సమయంలో నగిషీలు, డిజైన్లు చెక్కే సమయంలో కొంత బంగారం వేస్ట్ అవుతుంది. ఆ బంగారం వేస్టేజీ అటు తయారు చేసే స్వర్ణకారుడికి దక్కదు. అలాగే వినియోగదారుడు కూడా దక్కదు దీన్నే తరుగు లేదా వేస్టేజీ అంటారు. ప్రతి నగలను కచ్చితంగా ఎంతో కొంత తరుగు ఉంటుంది.  ఈ చార్జీలనే వినియోగదారుడు నుంచి వసూలు చేస్తారు. సాధారణంగా పాత బంగారు నగలను మార్చి కొత్త నగలను తీసుకునే సమయంలో తరుగు తీసేస్తారు.

నగల వ్యాపారులు వసూలు చేసే ధరల్లో మేకింగ్ చార్జీలు కూడా ఉంటాయి. ఇది దుకాణాన్ని బట్టి ధర కూడా మారవచ్చు. వాస్తవానికి, మేకింగ్ ఛార్జ్ ఎంత అనేది ఆభరణాలు,  నగల వ్యాపారిపై ఆధారపడి ఉంటుంది.

మేకింగ్ ఛార్జ్ / వేస్టేజీ చార్జ్ అంటే ఏమిటి?

వేర్వేరు నగల వ్యాపారులు వేర్వేరు మేకింగ్ ఛార్జీలను వసూలు చేస్తారు. సాధారణంగా, పెద్ద నగల వ్యాపారుల మేకింగ్ ఛార్జీ చిన్న వ్యాపారుల కంటే ఎక్కువగా ఉంటుంది. మేకింగ్ చార్జీని 'వేస్ట్' అని కూడా అంటారు. ఆభరణాలపై 3 శాతం చొప్పున GST  విధించే ముందు ఇది తుది ధరకు జోడించబడుతుంది. ఆభరణాల వ్యాపారులు మేకింగ్ ఛార్జీలలోనే వేస్టేజీని కూడా  చేర్చవచ్చు లేదా దాని కోసం విడిగా వసూలు చేయరని గమనించాలి. 

ఉదాహరణకు, 10 గ్రాముల బంగారు గొలుసు ధర రూ. 50,000 అయితే, ఆభరణాల వ్యాపారి వసూలు చేసే మేకింగ్ ఛార్జీ 10 శాతం అయితే, మీరు చెల్లించాల్సిన చివరి ధర రూ. 55,000 (GST మినహాయించి) .

గ్రాముకు ఫ్లాట్ రేటు ప్రకారం, మేకింగ్ ఛార్జీలు విధించినప్పుడు,

బంగారం ధర 10 గ్రాములకు రూ.60,000 అనుకుందాం.

20 గ్రాముల బంగారు ఆభరణం ధర: గ్రాముకు రూ. 5000 X 20 గ్రాములు = రూ. 1 లక్ష

మేకింగ్ ఛార్జీ: 20 గ్రాములు X గ్రాముకు రూ. 300 = రూ. 6 వేలు

మొత్తం ధర = రూ. 106000

మేకింగ్ ఛార్జీలు పర్సంటేజీలో ఉన్నప్పుడు

20 గ్రాముల బంగారు ఆభరణాల ఖరీదు: గ్రాముకు రూ. 5000 X 20 గ్రాములు = రూ. 1 లక్ష

మేకింగ్ ఛార్జీలు: రూ. 1 లక్షలో 12% = రూ. 12 వేలు

మొత్తం ఖరీదు = రూ. 112000

ధర వ్యత్యాసం: రూ. 6,000 (రూ. 112000-106000) వరకూ ఉంటుంది. 

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే తూనికలు, కొలతల శాఖకు చెందిన అధికారులు మాత్రం తరుగు అనేది మోసం అని చెబుతున్నారు. మేకింగ్ చార్జీల్లో, తరుగును కలిపి ఆ పేరిట పెద్ద నగల షాపులు సైతం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరమని చెబుతున్నారు. 

బంగారు నగలను తయారు చేయడానికి అయ్యే ఖర్చును మేకింగ్ చార్జీ అంటారు. దీన్నే మేకింగ్ చార్జ్ అనే పేరుతో బిల్లులో వేస్తారు. నగల మేకింగ్ చార్జీలనే మజూరి అని అంటారు. మజూరి అంటే కూలీ అని అర్థం. నగలు తయారు చేసిన కూలీలకు ఇచ్చే ఛార్జీలనే మేకింగ్ ఛార్జీ అంటారు. అయితే ఈ మేకింగ్ చార్జీ అనేది ఎంచుకున్న డిజైన్ ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆభరణానికి డిజైన్ వేరుగా ఉంటుంది. మెషిన్ తో తయారు చేసిన జ్యువలరీకి మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉంటాయి. అదే సమయంలో మనుషులు తమ చేతులతో  చేసిన జువెలరీకి మేకింగ్ చార్జెస్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మేకింగ్ చార్జీలు 6 నుంచి 25 శాతం వరకు ఉంటాయి ఎంత ఎక్కువ డిజైన్ ఉంటే మజూరి రేటు అంత పెరుగుతుంది. కానీ మెషీన్ తో చేసిన బంగారు నగలకు సైతం మేకింగ్ చార్జీలు వసూలు చేస్తుంటారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?