భార్య కారణంగా చిక్కుల్లో పడ్డ బ్రిటన్ ప్రధాని రిషి సునక్...పదవి సైతం పోయే ప్రమాదం..

Published : Apr 18, 2023, 12:32 PM ISTUpdated : Apr 18, 2023, 12:52 PM IST
భార్య కారణంగా చిక్కుల్లో పడ్డ బ్రిటన్ ప్రధాని రిషి సునక్...పదవి సైతం పోయే ప్రమాదం..

సారాంశం

ఏప్రిల్ 13న కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ప్రధానమంత్రి రిషి సునక్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణ MPల కోసం తయారు చేసిన ప్రవర్తనా నియమావళిలోని 6వ పేరాకు సంబంధించినది కావడం గమనార్హం. 

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ప్రధాని రిషి సునక్‌ను స్టాండర్డ్స్ కోసం పార్లమెంట్ కమిషనర్ దర్యాప్తు చేయనున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పిల్లల సంరక్షణ సంస్థలో పెట్టుబడిదారుగా ఉన్నారు. కొత్త సంరక్షణ పథకాన్ని ప్రకటించేటప్పుడు, రిషి ఇచ్చిన ప్రకటనలో నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్నారు. గత వారం గురువారం కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ప్రధానిపై విచారణ ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కమిషనర్ వెబ్‌సైట్ ద్వారా పంచుకున్నారు.

వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంలో, MPల కోసం అప్ డేట్ చేసిన ప్రవర్తనా నియమావళిలోని పారా 6కి సంబంధించి మాత్రమే ఈ విచారణ చేపట్టనున్నారు. నిజానికి, రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పిల్లల సంరక్షణ సంస్థలో పెట్టుబడిదారుగా ఉన్నారు. ఈ పరిస్థితిలో, చైల్డ్ కేర్ కంపెనీలో తన భార్య వాటాను సరిగ్గా ప్రకటించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు. ఈ నేపధ్యంలో రిషి ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించాడా అనే విషయంపై ఈ దర్యాప్తు కొనసాగనుంది. 

కమిషనర్ వెబ్‌సైట్ పంచుకున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 13న కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ప్రధానిపై దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఈ అంశాన్ని విపక్షాలు తీవ్ర స్థాయిలో లేవనెత్తాయి. రిజిస్టర్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమయంలో,రిషి సునాక్ ఆయన భార్య ఆస్తులను విడుదల చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

సునాక్ ప్రతినిధి దర్యాప్తును ధృవీకరించారు 
దర్యాప్తును ధృవీకరిస్తూ, సునక్ ప్రతినిధి మాట్లాడుతూ, "మేము దర్యాప్తులో పూర్తిగా సహక రిస్తున్నాము, దర్యాప్తులో పారదర్శకతను కొనసాగించాలనుకుంటున్నాము." అందుకే కమిషనర్‌కి సహకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి సునక్ భార్య కావడం గమనార్హం. ఆమె కంపెనీలో సుమారు 600 మిలియన్ డాలర్లు విలువైన 0.9% వాటాను కలిగి ఉంది. అయితే విచారణలో సునాక్ దోషిగా తేలితే, అతనిపై చర్య తీసుకునే కమిటీ అతనిని సభ్యత్వం నుండి సస్పెండ్ లేదా బహిష్కరించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్