బంగారం రికార్డు ధర...తగ్గిన డిమాండ్

Ashok Kumar   | Asianet News
Published : Jan 30, 2020, 03:22 PM ISTUpdated : Jan 30, 2020, 07:18 PM IST
బంగారం రికార్డు ధర...తగ్గిన డిమాండ్

సారాంశం

ఏదేమైనా 2020 లో  బంగారం వినియోగదారులలో  చైనా తరువాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది భారతదేశం. దేశీయ బంగారం ధర 2019లో పది గ్రాములకు 39,000 రూపాయలను దాటింది. అదే 2018 చివరినాటితో పోల్చుకుంటే దాదాపు 24 శాతం అధికం అని డబ్ల్యుజిసి  తాజా నివేదికలో తెలిపింది.

దేశీయ బంగారం ధర 2019లో పది గ్రాములకు 39,000 రూపాయలను దాటింది. అదే 2018 చివరినాటితో పోల్చుకుంటే దాదాపు 24 శాతం అధికం అని డబ్ల్యుజిసి  తాజా నివేదికలో తెలిపింది.అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2019 లో భారతదేశంలో బంగారం డిమాండ్ తొమ్మిది శాతం తగ్గి 690.4 టన్నులకు చేరుకుంది.ఏదేమైనా 2020 లో  బంగారం వినియోగదారులలో  చైనా తరువాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది భారతదేశం.  

"భారతదేశంలో బంగారం డిమాండ్ 2020లో 700-800 టన్నుల పరిధిలో ఉంటుంది" అని డబ్ల్యుజిసి భారత కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ చెప్పారు.ఇప్పటికే  ప్రభుత్వం 15 జనవరి  2020న హాల్‌మార్కింగ్ (నాణ్యత ధృవీకరణ)ను తప్పనిసరి చేసింది.

also read  Budget 2020: ‘ఇన్‌ఫ్రా’ పైనే వ్యాయం వృద్ధి రేటుకు పునాది...నిర్మల’మ్మ వ్యూహమేంటో? 

అయితే  ప్రస్తుత హాల్‌మార్క్ లేని బంగారం, బంగారు ఆభరణాలను విక్రయించడానికి లేదా మార్చడానికి ఒక సంవత్సరం టైమ్ ఇచ్చింది. భారత బంగారాన్ని మరింత నమ్మకమైనదిగా చేయడానికి ఇది సానుకూల సమయం అని ఆయన అన్నారు.

భారతదేశంలో బంగారం డిమాండ్ 2018 లో 760.4 టన్నుల నుండి 690.4 టన్నులకు తగ్గిందని, వీటిలో ఆభరణాల డిమాండ్ 598 టన్నుల నుండి తొమ్మిది శాతం తగ్గి 544.6 టన్నులకు చేరుకోగా, బార్, నాణేల డిమాండ్ కూడా 10 శాతం తగ్గి  162.4 టన్నుల నుండి 145.8  టన్నులుకు చేరుకుంది. 

also read Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

అయితే బంగారం డిమాండ్ అంతకుముందు సంవత్సరంలో 2,11,860 కోట్ల రూపాయల నుండి 2019 లో మూడు శాతం పెరిగి రూ .2,17,770 కోట్లకు చేరుకుంది.భారతదేశ బంగారు దిగుమతి 2018 లో 755.7 టన్నుల నుండి 2019 లో 14 శాతం తగ్గి 646.8 టన్నులకు చేరుకుందని డబ్ల్యుజిసి తెలిపింది.  

 "ఈ సంవత్సరం డిమాండ్ ఉన్నంత వేగంగా దిగుమతులు పెరగవని మేము నమ్ముతున్నాము. ప్రస్తుతం బంగారంపై కస్టమ్ డ్యూటీని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ఆశిస్తున్నాము ”అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు