
గడిచిన వారం అంతా ఎగుడుదిగుడుగా సాగిన తర్వాత, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 2.20 శాతం వీక్లీ నష్టాన్ని చవిచూసింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో రూ. 50,810 మార్క్‌తో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర 10 నెలల కనిష్టానికి దిగజారడానికి ప్రధాన కారణాలలో డాలర్ బలపడటం ప్రధానంగా కనిపిస్తోంది. గ్లోబల్ ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న భయాల మధ్య వడ్డీ రేటు పెంపుపై US ఫెడ్ హాకిష్ వైఖరి. శుక్రవారం స్పాట్ బంగారం ధర ఔన్సుకు దాదాపు 1,742 డాలర్ల వద్ద ముగిసింది, ఇది గడిచిన వారంలో 1,780 డాలర్ల సమీపంలో ట్రేడయ్యింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్పాట్ గోల్డ్ ధర గత వారం ఔన్స్‌కు 1,780 డాలర్లకు పడిపోయింది. డాలర్ పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపుపై యుఎస్ ఫెడ్ నిర్ణయం, ప్రపంచ ద్రవ్యోల్బణం ఆందోళనల వల్ల బంగారం ధరలు ప్రధానంగా ప్రేరేపిస్తున్నాయని పేర్కొంటున్నారు. MCX బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాముల స్థాయిలకు రూ. 50,400 నుండి రూ.52,000 రేంజులో ఉన్నాయని, నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారం ధరలపై తగ్గుదలకు కారణాలు చూస్తుంటే రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా ఇలా అన్నారు. "బంగారం ధరలు ఎగుడుదిగుడుగా సాగాయి మరియు వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లలో 10 నెలల కనిష్టానికి పడిపోయాయి, వారం చివరిలో నష్టాలను చవిచూశాయన్నారు.
ఈరోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,850గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,850గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,850గా ఉంది.
బంగారం ధర ఇలా తెలుసుకోండి
మీరు మొబైల్ ద్వారా కూడా బంగారం ధరను తనిఖీ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరను తనిఖీ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసే నంబర్‌కు మీ మెసేజ్ వస్తుంది. ఈ నంబర్ నుండి మీ నగరంలో ధర సమాచారాన్ని పొందిన తర్వాత మాత్రమే షాపింగ్ చేయండి.