
గత బుధవారం రోజున వంటగ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.50 పెరిగిన తర్వాత, ప్రతి ఒక్కరూ ఇంధన ధరల పై దృష్టి సారించారు. అయితే జూలై 9న నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. మే 21న కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే, దీంతోపెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అలాగే పెట్రోలు ధరలు లీటరుకు రూ.8 తగ్గగా, డీజిల్ ధర లీటరుకు రూ.6 తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అప్పటి నుంచి దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.
LPG సిలిండర్ ధర గత ఏడాదిలో ఎనిమిదోసారి పెరిగింది, ఇది సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. దేశంలో ఇంతకుముందు రూ.1,003కు విక్రయించిన 14.2 కిలోల సిలిండర్‌పై సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,053 అయింది.
ఇంధన ధరల విషయానికి వస్తే జూలై 09న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 కాగా, డీజిల్ ధర రూ. 89.62. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా ఉండగా, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03గా, డీజిల్ ధర లీటర్‌కు రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. దాదాపు ఒకటిన్నర నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోలు లీటరుకు రూ. 109.66, డీజిల్ ధర లీటరుకు రూ. 97.82గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ మరోసారి 110 డాలర్ల స్థాయిని దాటింది.