
బంగారం ధర మన దేశంలో రికార్డు స్థాయికి చేరింది. దేశంలోని పలు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 54,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారానికి రూ. 427 ధర పెరిగినట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,303గా ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.54,330 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,770గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,330గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.1300 వరకు ఎగబాకింది. ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.71,200 ఉండగా, ముంబైలో రూ.71,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, కేరళలో రూ.76,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, విజయవాడలో రూ.76,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.