
బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వివిధ కారణాలతో బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటోంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి ప్రధానంగా బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 45, 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50,180 రూపాయలుగా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 45, 990 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50,180 రూపాయలుంది. ఇక చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 45, 990 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50, 180 రూపాయలుగా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలో కూడా ప్రతిరోజూ మార్పు చోటుచేసుకుంటోంది. దేశవ్యాప్తంగా వెండి ధర కిలోకు రూ. 700 రూపాయలు పెరిగింది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 64,000కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,000కు చేరింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 64,000కు చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి రూ. 68,200 కాగా.. బెంగుళూరులో కిలో వెండి రూ. 70,000 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,000 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 700 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేట్ రూ. 70,000 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 700గా ఉంది.