Gold And Silver Prices Today: ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. వెండి మాత్రం..!

Published : Jan 25, 2022, 10:20 AM IST
Gold And Silver Prices Today: ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. వెండి మాత్రం..!

సారాంశం

దేశవ్యాప్తంగా మంగళవారం (జనవరి 25) బంగారం ధరలు (Gold Rates in India) భగ్గుమున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో పసిడి ధరలు పెరగగా.. ఢిల్లీ, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, బెంగళూరు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ధరలు నిలకడగా ఉన్నాయి.  

దేశవ్యాప్తంగా మంగళవారం (జనవరి 25) బంగారం ధరలు (Gold Rates in India) భగ్గుమున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో పసిడి ధరలు పెరగగా.. ఢిల్లీ, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, బెంగళూరు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ధరలు నిలకడగా ఉన్నాయి.

బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో  చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,830గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతుంది.

వెండి ధ‌ర‌లు

మంగళవారం (జనవరి 25)న దేశంలో వెండి ధర దిగి వచ్చింది. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,700లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,700లుగా కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,700లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 64,700లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ. 69,000లుగా కొనసాగుతోంది. కాగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి ధ‌ర‌ రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Chicken Price: శ్రావణ మాసం వల్ల చికెన్, గుడ్లు ధరలు ఒక్కసారిగా కింద పడ్డాయి
Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్