రోజుకి రోజుకి షాకిస్తున్న బంగారం ధరలు.. సామాన్యులు కొనలేని స్థాయికి పసిడి, వెండి.. నేటి ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Apr 27, 2023, 9:23 AM IST
Highlights

హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి.  హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 100 పెంపుతో రూ. 55,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 61,040.

బంగారం ధరలు రోజురోజుకి ఆకాశానికి చేరుతున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే నేడు గురువారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. ఒక నివేదిక ప్రకారం, 1 గ్రాము 22K బంగారం ధర రూ. 5,595, 8 గ్రాముల ధర  రూ. 44,760, 10 గ్రాముల ధర రూ. 5,950గా  ఉంది. అదేవిధంగా  10 గ్రాములు 24కే బంగారం ధర రూ. 61,040. 

ఢిల్లీ, జైపూర్, చండీగఢ్, గుర్గావ్ లో 22K బంగారం 10 గ్రాముల ధర రూ .56,100,  24K బంగారం 10 గ్రాముల ధర రూ . 61,190

ముంబై, కోల్‌కతా, పూణేలో 22K బంగారం 10 గ్రాముల ధర రూ .55,950, 24K బంగారం 10 గ్రాముల ధర రూ . 61,040

చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ, వెల్లూర్ లో 22K బంగారం 10 గ్రాముల ధర రూ .55,420, 24K బంగారం 10 గ్రాముల ధర రూ .61,550

అయితే, పైన పేర్కొన్న ధరలు GST, TCS ఇంకా స్థానిక లెవీలు వంటి పన్నులు లేకుండా ఉన్నాయని గమనించాలి. రియల్ టైం ధరలను తెలుసుకోవడానికి కస్టమర్లు తప్పనిసరిగా స్థానిక ఆభరణాల షాపులను సంప్రదించాల్సి ఉంటుంది.మరోవైపు  వెండి ధర నేడు క్షీణించింది, 1 గ్రాము ధర రూ.76.50 వద్ద, 10 గ్రాముల ధర  రూ. 765 వద్ద, 1 కిలో ధర రూ.76,700 వద్ద ఉంది.

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, లక్నోలలో  కేజీ వెండి ధర రూ.76,500. 

ఇక  స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1991.50 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర $24.96 డాలర్ల వద్ద, గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ  నేడు రూ.81.78 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 61,040. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 100 పెంపుతో రూ. 55,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 61,040. 

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 80,200.

click me!