ముఖేష్ అంబానీ 22 అంతస్థుల భవనాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన అతను ఎవరు.. దీని విలువ ఎంతో తెలుసా..

By asianet news teluguFirst Published Apr 26, 2023, 6:15 PM IST
Highlights

ఒక నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ తన పాత ఉద్యోగులలో ఒకరైన మనోజ్ మోడీకి గిఫ్ట్ గా ఇచ్చిన ఇంటి విలువ దాదాపు రూ. 1500 కోట్లుగా అంచనా. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్, ఆసియా అత్యంత సంపన్నుడు  ముఖేష్ అంబానీ తన ఉద్యోగి, కుడి చేతి భుజం లాంటి మనోజ్ మోదీకి 22 అంతస్తుల ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారు.

ఒక నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ తన పాత ఉద్యోగులలో ఒకరైన మనోజ్ మోడీకి గిఫ్ట్ గా ఇచ్చిన ఇంటి విలువ దాదాపు రూ. 1500 కోట్లుగా అంచనా. 

ఆస్కార్ అవార్డును గెలుచుకున్న RRR వంటి 3 సినిమాలను ఈ 1500 కోట్ల రూపాయలతో హాయిగా తీయవచ్చ. RRR సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు.

నివేదికల ప్రకారం, ఈ 22 అంతస్తుల భవనం ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఉంది. ఈ భవనం పేరు 'బృందావన్'.

నేపియన్ సీ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలు సాధారణంగా చదరపు అడుగులకు రూ.45,100 నుండి రూ.70,600 వరకు ఉంటాయి. మనోజ్ మోదీకి లభించిన బహుమతిలోని ఒక్కో అంతస్తు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

ఈ 'బృందావన్' భవనం మొత్తం వైశాల్యం దాదాపు 1.7 లక్షల చదరపు అడుగులు. నివేదికల ప్రకారం, భవనం మొదటి 7 అంతస్తులు కార్ పార్కింగ్ కోసం కేటాయించారు.

ఈ విలాసవంతమైన భవనం ప్రత్యేకత ఏంటంటే దానిలోని చాలా ఫర్నిచర్ ఇటలీ నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నట్లు అంచనా.

మనోజ్ మోదీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యంత విశ్వసనీయ ఉద్యోగి అలాగే ముఖేష్ అంబానీ స్నేహితుడని చెబుతుంటారు. ఈ ఇద్దరూ 'యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ'లో కలిసి చదువుకున్నారు కూడా.

చదువు పూర్తయ్యాక మనోజ్ మోదీ ముఖేష్ అంబానీని వదలకుండా 80వ దశకంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనోజ్ మోడీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖ్యమైన భాగంగా మారారు. ముఖేష్ అంబానీ ఇంకా మనోజ్ మోడీ ఒకరికొకరు అత్యంత సన్నిహిత బంధాన్ని ఏర్పర్చుకున్నారు.

click me!