బంగారం ధర తగ్గింది. మీ నగరంలో ఎంత తగ్గిందో చక చకా ఇక్కడ చెక్ చేసుకోండి..

By Krishna AdithyaFirst Published Sep 12, 2022, 10:33 AM IST
Highlights

నేడు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలకు చెక్ పడింది. అంతేకాదు. అయితే పండుగల సీజన్ కావడంతో భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని బులియన్ పండితులు చెబుతున్నారు. 

కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అలాగే  వెండి ధర కూడా తగ్గింది. ఇదిలా ఉంటే, మీరు ఈ రోజు బంగారు, వెండి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ రోజు హైదరాబాద్ లో బంగారం, వెండి ధర ఎంత? దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం.  

వారం ప్రారంభంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు సోమవారం,బంగారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.  24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు దాదాపు రూ. 125 (0.26%) తగ్గి రూ. 50,400కి చేరుకుంది. అదే సమయంలో, వెండి ధర స్వల్ప పెరుగుదలతో కిలో రూ. 55085 వద్ద ఉంది.

గత వారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, గత వారం (22 నుండి 26 ఆగస్టు) ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర 50,770గా ఉంది, ఇది శుక్రవారం వరకు 10 గ్రాములకు రూ. 50,877కి పెరిగింది. . అదే సమయంలో 999 స్వచ్ఛత కలిగిన వెండి కిలో ధర రూ.53,363 నుంచి రూ.54,700కి పెరిగింది. ఇప్పుడు ఈ వారం బంగారం పతనంతో ప్రారంభమైంది.

ఈ వారంలో బంగారం, వెండి సానుకూలంగా ట్రేడవుతుందని భావిస్తున్నామని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ అండ్ కమోడిటీ) అనూజ్ గుప్తా తెలిపారు. 

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం (10GM)
22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర - రూ. 46,800
24 క్యారెట్ల బంగారం ధర (అపరంజి) - రూ. 51,050

దేశంలోని అనేక ప్రాంతాల్లో నేటి బంగారం ధర రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 46,800 ఉంది. ఇంకా, చెన్నై, ముంబై మరియు కోల్‌కతా వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో దీని ధర రూ. 47,400, రూ. 46,750, రూ. 46,750, నిన్నటి రేటుకి తేడా లేదు. అదేవిధంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం బంగారం ధర రూ.46,900గా ఉంది. అవును, నిన్నటి ధర అదే. 

దేశంలో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి ధర తగ్గింది. భారతదేశంలో వెండి ధరలు అంతర్జాతీయ వ్యత్యాసాలు, డాలర్‌తో రూపాయి పనితీరుపై ఆధారపడి ఉంటాయి, ఇది దేశీయ బంగారం-వెండి ధరలను ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ పెరగడం, తగ్గడం వల్ల బంగారం, వెండి ధరలు కూడా మారుతూ ఉంటాయి. 

ఈ విధంగా మీరు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు
అలాగే బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల  ఒక మొబైల్ యాప్‌ను తయారు చేసింది. దీని పేరు 'బిఐఎస్ కేర్ యాప్'. దీంతో కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడం సులభం. అంతే కాకుండా బంగరం స్వచ్ఛతపై అనుమానాలు, లేదా ఏవైనా ఫిర్యాదునైనా చేయవచ్చు.

click me!