Google Pixel 6A ఫోన్ 43,999కి కాదు, కేవలం రూ. 27,699కి అందుబాటులో ఉంటుంది, Flipkart Saleలో భారీ డిస్కౌంట్

By Krishna Adithya  |  First Published Sep 11, 2022, 4:45 PM IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా పలు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో Samsung, Oppo, Realme, Poco వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు, మరిన్ని  ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి.


బిగ్ బిలియన్ డేస్ డీల్స్‌లో ఎక్స్‌ఛేంజ్‌లో బెస్ట్ డీల్స్, నో కాస్ట్ EMI, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ఆఫర్‌లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లలో స్మార్ట్‌ఫోన్‌లపై ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నాయి. నో-కాస్ట్ EMI నెలకు రూ. 1750 నుండి ప్రారంభం కాగా, 100% స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ. 99 నుండి ప్రారంభమవుతుంది. సూపర్ కాయిన్‌లను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లపై వినియోగదారులు రూ. 500 వరకు తగ్గింపును కూడా పొంవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. విక్రయానికి ముందు ఫ్లిప్‌కార్ట్ కొన్ని ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్‌లపై నథింగ్ ఫోన్ (1). గూగుల్ పిక్సెల్ 6A వంటి ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది, అటు అమెజాన్ కూడా సెప్టెంబర్ 23 నుండి తన మెగా సేల్‌ను ప్రారంభించబోతోంది.

Latest Videos

Google Pixel 6A రూ.27,699కి అందుబాటులో ఉంటుంది
Flipkart నథింగ్ ఫోన్ (1), Google Pixel 6A కోసం పోస్ట్-డిస్కౌంట్ ధరను వెల్లడించింది. ప్రారంభించిన సమయంలో, Google Pixel 6A ధర రూ.43,999గా ఉంటే, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు తర్వాత 27,699కి అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్స్, ఇతర ఆఫర్‌లు ఉంటాయి.

తన బిగ్ బిలియన్ విక్రయ సమయంలో, Flipkart ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. పాత ఫోన్ విలువ దాని మోడల్, తయారీ సంవత్సరం, పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది.

Google Pixel 6a ఫీచర్లు
Google Pixel 6A డిస్ ప్లే 6.1 అంగుళాలు కాగా, ఇది పూర్తి HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తోంది. గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లే ఇందులో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoCపై రన్ అవుతుంది. ఇది 6GB LPDDR5 RAM, Titan M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌తో 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

Google Pixel 6a వెనుక రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో మొదటి కెమెరా 12.2 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 12 మెగాపిక్సెల్స్. ముందు కెమెరా 8 మెగాపిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంది. Google Pixel 6A 5G, 4G LTE, Wi-Fi 6E మరియు బ్లూటూత్ v5.2కి మద్దతు ఇస్తుంది. ఇది 4,410mAh బ్యాటరీని కలిగి ఉంది.

click me!