Gold And Silver Price Today: బంగారం ధ‌ర‌లు ఇలా.. వెండి ధ‌ర‌లు అలా..!

Published : Jun 29, 2022, 08:26 AM IST
Gold And Silver Price Today: బంగారం ధ‌ర‌లు ఇలా.. వెండి ధ‌ర‌లు అలా..!

సారాంశం

బంగారం ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. బుధ‌వారం పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగా కనసాగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి రేటు కిలోకు రూ. 400 దిగివచ్చింది.   

బంగారం ధర శాంతించింది. నిన్న పెరిగిన పసిడి రేట్లు నేడు మాత్రం నిలకడగానే కొనసాగాయి. జూన్ 29న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.47,650 వద్దనే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే రూ. 51,980 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధ‌ర‌ మాత్రం పడిపోయింది. బుధ‌వారం వెండి రేటు రూ. 400 దిగివచ్చింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 65,600కు పడిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు బుధ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధ‌వారం (జూన్ 29, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,000 ఉండగా, ముంబైలో రూ.60,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, కోల్‌కతాలో రూ.60,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, కేరళలో రూ.65,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, విజయవాడలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?