Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 21, 2022, 08:44 AM IST
Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు కాస్త పెరిగింది. ఇక వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,080గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,300గా ఉంది.  

బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా..? లేదంటే వెండి కొనేందుకు సిద్ధమౌతున్నారా..? అయితే మీరు ముందుగా చేయాల్సిన పని ఒకటే. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. బంగారం ధరలు ప్రతి రోజూ మారుతూ ఉండొచ్చు. మంగళ‌వారం పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. జూన్ 21న హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 100 పెరిగింది. పది గ్రాములకు రూ. 52,080కు చేరింది. ఇది 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు విషయానికి వస్తే.. ఇది రూ. 100 పెరుగుదలతో రూ. 47,750కు ఎగసింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు మంగళ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళ‌వారం (జూన్ 21, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,110గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,190గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,080 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,750 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,080గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,750 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,080గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,000 ఉండగా, ముంబైలో రూ.61,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కోల్‌కతాలో రూ.61,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కేరళలో రూ.66,300గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, విజయవాడలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !