Bank License Cancel: ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. కస్టమర్ల పరిస్థితేంటి..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 20, 2022, 04:05 PM IST
Bank License Cancel: ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. కస్టమర్ల పరిస్థితేంటి..?

సారాంశం

రిజర్వు బ్యాంక్ తాజాగా ఒక బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. జూన్ 18 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో బ్యాంక్ ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ సర్వీసులను నిర్వహించడానికి అవకాశం ఉండదు.  

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లాత్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. జూన్ 18 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. కర్నాటక కేంద్రంగా ఈ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ వద్ద సరిపడినంత క్యాపిటల్ లేకపోవడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ తాజా బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఇకపై మిల్లాత్ కో ఆపరేటివ్ బ్యాంక్ సేవలు అందించడానికి వీలు ఉండదు. బ్యాంక్ కార్యకలాపాలు అన్నీ క్లోజ్ అవుతాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సోసైటీస్ కూడా బ్యాంక్ సర్వీసులు క్లోజ్ అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్‌బీఐ కోరింది. అంతేకాకుండా బ్యాంక్‌కు ఒక లిక్విడేటర్‌ను కూడా నియమించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక ప్రెస్ రిలీజ్‌ను విడుదల చేసింది.

బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేదు. అంతేకాకుండా ఆదాయ అంచనాలు కూడా లేవు. ఇంకా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11 (1), సెక్షన్ 22 (3) (డీ) సెక్షన్లను కూడా ఈ బ్యాంక్ బ్రేక్ చేసిందని ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అందుకే బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసేశామని తెలిపింది. బ్యాంక్ సేవలను అలాగే కొనసాగిస్తే డిపాజిట్ దారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను గమనిస్తే.. డిపాజిట్ దారులకు పూర్తి మొత్తంలో డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉందని ఆర్‌బీఐ వివరించింది. 

దీని బ్యాంక్ బ్యాంకింగ్ బిజినెస్‌ను అలాగే కొనసాగించడం వల్ల ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు భరోసా కల్పించింది. బ్యాంక్ క్లోజ్ అయినా కూడా డిపాజిట్ దారులకు వచ్చే ఇబ్బంది లేదని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి వారి డబ్బులు అందుతాయని పేర్కొంది. కాగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద బ్యాంక్ ఖాతాదారులకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు లభిస్తాయి. అంటే రూ. 5 లక్షలకు పైగా డిపాజిట్ కలిగి ఉంటే.. అప్పుడు వారికి రూ. 5 లక్షల వరకే వస్తాయి. మిగిలిన వాటిని కోల్పోవలసి రావొచ్చు. ఆర్‌బీఐ వద్ద ఉన్న బ్యాంక్ సమాచారం ప్రకారం.. బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి వారి డబ్బులు పూర్తిగా లభించనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్