Gold And Silver Price Today: పసిడి ప్రియులకు శుభ‌వార్త‌.. బంగారం బాట‌లోనే వెండి ధరలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 01, 2022, 10:09 AM IST
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు శుభ‌వార్త‌.. బంగారం బాట‌లోనే వెండి ధరలు..!

సారాంశం

బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.150 తగ్గి రూ.48,400గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో.. రూ.52,800గా రికార్డయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (మే 1, 2022) నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. ఏకంగా 10 గ్రాములకు రూ.150 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.300 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర మార్కెట్‌లో రూ.48,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.69,500 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మే 1, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!  

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,030 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,400 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,400 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, ముంబైలో రూ.63,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, కోల్‌కతాలో రూ.63,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, కేరళలో రూ.69,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, విజయవాడలో రూ.69,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు