కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న జి‌ఎం‌ఆర్...ప్రభుత్వ అనుమతితో....

By Sandra Ashok Kumar  |  First Published Feb 11, 2020, 3:50 PM IST

జిఎంఆర్ విమానాశ్రయాలు దాని గ్రీకు భాగస్వామి జిఇకె టెర్నాతో కలిసి 35 సంవత్సరాల పాటు రాయితీ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో ఐదేళ్ల  పాటు మొదటి దశ నిర్మాణం కూడా ఉంది.
 


న్యూ ఢిల్లీ: గ్రీస్‌లోని హెరాక్లియోన్ నగరం క్రీట్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం రూపకల్పన, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్ వంటి  నిర్వహణను సాధించినట్లు జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సోమవారం తెలిపింది. గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ విమానాశ్రయా ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా పునాదిరాయి వేశారు.

జిఎంఆర్ విమానాశ్రయాలు దాని గ్రీకు భాగస్వామి జిఇకె టెర్నాతో కలిసి 35 సంవత్సరాల పాటు రాయితీ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో ఐదేళ్ల  పాటు మొదటి దశ నిర్మాణం కూడా ఉంది.కొత్త విమానాశ్రయం అభివృద్ధి కోసం 500 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడి పెట్టాలని కన్సార్టియం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ అనుమతితో అధిక నిధులను సమకూరుస్తుంది ఇందుకోసం ఎటువంటి రుణం అవసరం కూడా లేదు.

Latest Videos

also read కరోనా ఎఫెక్ట్: ఆ పేరు వింటేనే హోటల్‌ పరిశ్రమ వణికిపోతోంది...

ప్రస్తుత విమానాశ్రయం నుండి వచ్చే ఆదాయం, గ్రీస్ ప్రభుత్వం అందించే ఆర్థిక మంజూరు ద్వారా ఈ మొత్తం ప్రాజెక్టుకు నిధులు సమకూరుతాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలలో గ్రీస్ దేశం ఒకటి, సంవత్సరానికి దాదాపు 33 మిలియన్ల మంది పర్యాటకులను ఇక్కడికి వస్తుంటారు. గ్రీస్‌లోని క్రీట్ అతిపెద్ద ఐలాండ్ కు ఎక్కువ మంది సందర్శిస్తుంటారు.

 క్రీట్ లోని హెరాక్లియోన్ విమానాశ్రయం గ్రీస్‌ దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద విమానాశ్రయం. ఇక్కడ గత మూడేళ్లలో 10 శాతం సి‌ఏ‌జి‌ఆర్ ట్రాఫిక్ వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఉన్న విమానాశ్రయం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. దాని స్థానంలో కస్టెల్లి వద్ద కొత్త విమానాశ్రయం భర్తీ చేయబడుతుంది.

also read  కరోనాకు మందు కనిపెట్టిన వారికి కోటి రూపాయలు:జాకీ చాన్

యూరోపియన్ విమానాశ్రయాన్ని నిర్వహించడానికి బిడ్ గెలిచిన మొట్టమొదటి భారతీయ విమానాశ్రయ ఆపరేటర్ జిఎంఆర్. ఇయు ప్రాంతంలో జిఎంఆర్ గ్రూప్ మొట్టమొదటి ప్రయత్నం అని జిఎంఆర్ గ్రూప్‌లోని ఫ్యుయెల్  అంతర్జాతీయ విమానాశ్రయాల చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాలా తెలిపారు.


జిఎంఆర్ విమానాశ్రయాలలో ఐదు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియో కలిగి ఉంది. ఇందులో భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫిలిప్పీన్స్‌లోని మెగావైడ్ భాగస్వామ్యంతో మాక్టాన్ సిబూ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.ఇది గోవాలోని మోపాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది.

click me!