అమెరికా ఆర్థిక మాంద్యం భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

By Galam Venkata Rao  |  First Published Aug 5, 2024, 12:44 PM IST

అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈ రోజు (ఆగస్టు 5న) వరుసగా రెండో సెషన్‌లోనూ పతనమయ్యాయి.


అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలతో ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 410 పాయింట్లు పతనమై 24,306 వద్ద, సెన్సెక్స్ 1,372 పాయింట్లు క్షీణించి 79,609 వద్ద ఉన్నాయి.
 
అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈ రోజు (ఆగస్టు 5న) వరుసగా రెండో సెషన్‌లోనూ పతనమయ్యాయి. అంతకుముందు సెషన్‌లో నమోదైన రూ.457.16 లక్షల కోట్ల విలువతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద రూ.17.03 లక్షల కోట్లు తగ్గి రూ.440.13 లక్షల కోట్లకు చేరుకుంది.
 
సెన్సెక్స్ 2,037 పాయింట్లు పతనమై 78,944 వద్ద, నిఫ్టీ 661 పాయింట్లు క్షీణించి 24,056 వద్ద ట్రేడవుతున్నాయి. 
 

టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, M&M, SBI, JSW స్టీల్, టైటాన్ లాంటి స్టాక్స్ సెన్సెక్స్ 5.04 శాతం వరకు పడిపోయాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ రోజు (ఆగస్టు 5) మార్కెట్ ఇలా ఉంది...

Latest Videos

నష్టాల్లో నిఫ్టీ స్టాక్స్... 
46 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, హిందాల్కో, ONGC, శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్  షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రారంభ ఒప్పందాల్లో 4.37 శాతం వరకు పడిపోయాయి. 

బీఎస్ఈలో 88 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

ఈరోజు (ఆగస్టు 5) దాదాపు 88 స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు, ఇవాళ ప్రారంభ డీల్స్‌లో 42 షేర్లు బీఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి చేరాయి.

3,421 స్టాక్‌లలో 394 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. దాదాపు 2,891 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతుండగా... 136 స్టాక్స్ ఎలాంటి మార్పు లేదు.

లోయర్ సర్క్యూట్‌ల కంటే హైయర్‌ సర్క్యూట్‌లు ఎక్కువ...

ఇవాళ (ఆగస్టు 5) ఉదయం ప్రారంభ సెషన్‌లో స్టాక్ మార్కెట్ క్రాష్ కావడంతో దాదాపు 103 స్టాక్‌లు వాటి అధిక సర్క్యూట్‌లను తాకాయి. మరోవైపు, 197 షేర్లు తమ లోయర్ సర్క్యూట్ పరిమితులను తాకాయి. ఇది మార్కెట్లో బలహీనమైన సెంటిమెంట్‌ను సూచిస్తుంది.

FIIలు నికర విక్రేతలు...

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నికర ప్రాతిపదికన రూ.3,310 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా... తాత్కాలిక ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,965.94 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

ప్రీవియస్‌ క్లోజ్‌...
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 24,717 వద్ద, సెన్సెక్స్ 886 పాయింట్లు కోల్పోయి 80,982 వద్ద ముగిశాయి.

US మార్కెట్లు ఇలా...
US ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గత వారం విడుదలైన బలహీనమైన US ఉద్యోగాల డేటా.. శుక్రవారం US మార్కెట్లలో క్రాష్‌కు దారితీసింది. 

NASDAQ కాంపోజిట్ ఇండెక్స్ 417 పాయింట్లు లేదా 2.43% పడిపోయి 16,776 వద్ద, S&P 500 ఇండెక్స్ 1.84% లేదా 100 పాయింట్లు తగ్గి 5,346 వద్ద ముగిసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ శుక్రవారం 1.51% లేదా 610 పాయింట్లు క్షీణించి 39,737 వద్దకు చేరుకుంది.

లేబర్ మార్కెట్‌లో, USలో కొత్త డేటా 236,000 అంచనాల కంటే 249,000 కంటే ఎక్కువ నిరుద్యోగ క్లెయిమ్‌లను సూచించింది. 

అలాగే, USలో జూలైలో ISM తయారీ పడిపోయింది. ISM తయారీ సూచిక జూన్‌లో 48.5% ఉండగా.. జూలైలో 46.8%కి పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. కాగా, US ఫ్యాక్టరీలు ఇప్పటికీ తిరోగమనంలో ఉన్నాయి. 

యూఎస్‌ మార్కెట్‌ బలహీన పడిన ప్రభావం ఆసియా, యూరప్‌ మార్కెట్లపైనా పడింది. 

ఆసియా మార్కెట్లు...
ఈరోజు (ఆగస్టు 5) జపాన్‌కు చెందిన నిక్కీ 2,747 పాయింట్లు పతనమై 33,162 వద్ద, హాంగ్ సెంగ్ 36 పాయింట్లు దిగజారి 16,908 వద్ద నిలిచాయి. తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 1,584 పాయింట్లు పతనమై 20,044కి పడిపోయింది. కోస్పీ సోమవారం 182 పాయింట్లు తగ్గి 2,494 వద్ద ఉంది.

యూరోపియన్ మార్కెట్లు...
శుక్రవారం FTSE 108 పాయింట్లు పతనమై 8,174 వద్ద నిలిచింది. ఫ్రాన్స్ CAC 119 పాయింట్లు పతనమై 7,251కి చేరుకుంది. డాక్స్ 421 పాయింట్లు తగ్గి 17,661 వద్ద ముగిసింది.

click me!