మీ ముఖ్యమైన పనిని త్వరగా చేయండి ! ఈ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్..

By Ashok kumar Sandra  |  First Published Mar 5, 2024, 7:28 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండ్  సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలచే బ్యాంక్ సెలవులు నిర్ణయించబడతాయి. మార్చిలో ఏ రాష్ట్రంలో  ఎన్ని రోజులు బ్యాంక్ సెలవులు రానున్నాయో  తెలుసుకోండి... 
 


వివిధ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులపై ఆధారపడుతుంటాం... అయితే  బ్యాంకులు మూతబడితే ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మార్చి నెలలో కొన్ని రోజులలో బ్యాంకు మూసివేయబడవచ్చని ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇందుకు మీ ముఖ్యమైన పనిని  ముందుగానే చేయవచ్చు.  మార్చిలో వీకెండ్  సెలవులు, పండుగల కారణంగా బ్యాంకులు చాలా రోజులు  బంద్ కానున్నాయి. మార్చి 2024లో మొత్తం 14 రోజుల హాలిడేస్   కారణంగా  బ్యాంకులు మూసివేయబడతాయి.

ఇందులో రెండవ,  నాల్గవ శనివారాలు ఇంకా  ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు అలాగే కొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి.  

Latest Videos

undefined

1. మార్చి 8, శుక్రవారం - మహాశివరాత్రి/శివరాత్రి (త్రిపుర, మిజోరం, తమిళనాడు, సిక్కిం, అస్సాం, మణిపూర్, ఇటానగర్, రాజస్థాన్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, బీహార్ ఇంకా మేఘాలయ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి).

2. మార్చి 9, శనివారం - ఈ నెలలో రెండవ శనివారం కావునా   దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

3. మార్చి 10, ఆదివారం - బ్యాంకు వీకెండ్  హాలిడే. దింతో  దేశవ్యాప్తంగా బ్యాంకులు  మూసివేయబడతాయి.

4. మార్చి 17, ఆదివారం - బ్యాంకు వీకెండ్  హాలిడే.  ఈ రోజున  దేశవ్యాప్తంగా బ్యాంకులు  మూసివేయబడతాయి.

5. మార్చి 22, శుక్రవారం - బీహార్ దివాస్  సందర్భంగా బీహార్‌లో బ్యాంకులు సెలవును పాటించనున్నాయి.

6. మార్చి 23, శనివారం - నెలలో నాల్గవ శనివారం కారణంగా  దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

7. మార్చి 24, ఆదివారం - బ్యాంకు వీకెండ్ హాలిడే.   దేశవ్యాప్తంగా బ్యాంకులు  మూసివేయబడతాయి.

8. మార్చి 25, సోమవారం - హోలీ (రెండవ రోజు) - ధూలేటి/డోల్ యాత్ర/ధులంది

కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్ అండ్  శ్రీనగర్ మినహా హోలీ/ధూలేటి/డోల్ యాత్ర/ధులందీ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

9. మార్చి 26, మంగళవారం - యయోసాంగ్ 2వ రోజు/హోలీ

ఒడిషా, మణిపూర్ ఇంకా బీహార్‌లలో యయోసాంగ్ రెండవ రోజు/హోలీ నాడు బ్యాంకులు మూసివేయబడతాయి.

10. మార్చి 27, బుధవారం - హోలీ

బీహార్‌లో హోలీ వేడుకల కారణంగా మార్చి 27న బ్యాంకులు మూతపడనున్నాయి.

11. మార్చి 29, శుక్రవారం - గుడ్ ఫ్రైడే. ఈ రోజున త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఇంకా  హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

12. 31 మార్చి, ఆదివారం - బ్యాంక్  వీకెండ్ హాలిడే.  దేశవ్యాప్తంగా బ్యాంకులు వీకెండు కారణంగా  మూసివేయబడతాయి.

click me!