Generosity:ఉద్యోగి మృతితో బ్యాంకు సీఈవో దాతృత్వం.. కుటుంబానికి 2 కోట్ల సహాయం..

Ashok Kumar   | Asianet News
Published : Mar 18, 2022, 01:35 PM IST
Generosity:ఉద్యోగి మృతితో బ్యాంకు సీఈవో దాతృత్వం.. కుటుంబానికి 2 కోట్ల సహాయం..

సారాంశం

దాతృత్వంతో వార్తల్లో నిలిచిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వి వైద్యనాథన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఉద్యోగి ఒకరు చనిపోవడంతో ఆయన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దృష్ట్యా ఈసారి  ఐదు లక్షల షేర్లను ఇచ్చాడు. 

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఒ వి వైద్యనాథన్ తన దాతృత్వం కారణంగా చర్చల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. వాస్తవానికి, బ్యాంకు ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబానికి  వైద్యనాథన్ ఐదు లక్షల షేర్లను సహాయంగా ఇచ్చాడు. ఐ‌డి‌ఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన నోటీసులో ఈ సమాచారాన్ని వెల్లడించింది.

వైద్యనాథన్ ఐదు లక్షల షేర్లు
బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  ఐ‌డి‌ఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్  ఎం‌డి అండ్ సి‌ఈ‌ఓ, వినూత్న బ్యాంకింగ్ శైలికి పేరుగాంచిన వి వైద్యనాథన్ చనిపోయిన తన సహచరుడి కుటుంబ సభ్యులకు బ్యాంక్‌లో వాటాలు ఇచ్చారు. ఈ షేర్ల ప్రస్తుత ధర రూ.2.1 కోట్లకు పైగా ఉంది.

వైద్యనాథన్ తన ఉద్యోగులు, ట్రైనర్లు, గృహ సహాయకులు, డ్రైవర్లకు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికి గతంలో ఎన్నో సందర్భాల్లో  షేర్లను బహుమతిగా అందించడం గమనించదగ్గ విషయం. అయితే తన సన్నిహిత ఉద్యోగి మరణానంతరం  ఉద్యోగి కుటుంబానికి విద్య, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఈవో ఈ షేర్లను ఇచ్చారని నివేదిక పేర్కొంది. 

ప్రైవేట్ రంగ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఒ వి వైద్యనాథన్ ఇటువంటి దాతృత్వానికి ఎన్నో ఉదాహరణల ద్వారా ఇప్పటికే ముఖ్యాంశాలుగా నిలిచారు. గత ఏడాది ప్రారంభంలో అతను తన డ్రైవర్, హౌస్ హెల్ప్, ట్రైనర్ అండ్ మరో ఇద్దరికి కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చాడు. ఒక నివేదిక ప్రకారం, వైద్యనాథన్ వీరికి ఇంటి కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికి రూ. 3.95 కోట్లకు పైగా విలువైన తొమ్మిది లక్షల షేర్లను ఇచ్చాడు. 

తొమ్మిది లక్షల షేర్లు గిఫ్ట్  గా
వి వైద్యనాథన్ తన తొమ్మిది లక్షల ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌ రూపంలో ఇచ్చినట్లు బ్యాంక్ తరపున రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం, బ్యాంక్ సీఈఓ వైద్యనాథన్  తన ట్రైనర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చాడు. అదనంగా, హౌస్ హెల్ప్ ప్రాంజల్ నార్వేకర్ అండ్ డ్రైవర్ అల్గరాసామి సి మునపర్‌కు 2 లక్షల షేర్లు ఇంకా కార్యాలయ సహాయక సిబ్బంది దీపక్ పటారే అలాగే హౌస్ హెల్ప్ సంతోష్ జోగ్లేలకు ఒక్కొక్కరికి 1 లక్ష షేర్లు బహుమతిగా అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు