Gold Price Update: శ్రావణం వచ్చేస్తోంది, బంగారం కొనే వారికి ఇప్పుడే తక్కువ ధరకు కొనే చాన్స్, నేటి ధరలు ఇవే...

Published : Jul 10, 2022, 10:22 AM IST
Gold Price Update: శ్రావణం వచ్చేస్తోంది, బంగారం కొనే వారికి ఇప్పుడే తక్కువ ధరకు కొనే చాన్స్, నేటి ధరలు ఇవే...

సారాంశం

పసిడి కొనే వారికి గుడ్ న్యూస్, గత వారం రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు, ఆదివారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. జూలై 10, 2022న భారతదేశంలో బంగారం ధర మారదు. ఆదివారం నాటికి, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,850 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 46,580.

భారతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా కస్టమర్లలో బంగారం కొనుగోలుపై  గందరగోళం ఉంది. మీరు బంగారం కొనాలనుకుంటే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరో వైపు రాబోయే శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సీజన్‌ స్టార్ట్ కాబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లో సందడి నెలకొంది.

నిజానికి బంగారం తన  గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు రూ.4600 మేర బంగారం చౌకగా అమ్ముడవుతోంది. ఇది ఒక రకంగా పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే విషయమే. ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా) ధర రూ. 51,100 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా) ధర రూ. 46,580 గా ఉంది. 

ఇక రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,850గా ఉంది. ఏపీ రాజధాని విజయవాడ, గుంటూరు ప్రాంతంలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,850గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో నేడు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,850గా నమోదైంది.

నెల్లూరులో ఈరోజు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర ఈరోజు రూ.46,850గా ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ (10 గ్రా), 22 క్యారెట్ (10 గ్రా) బంగారం ధర అలాగే ఉంది.

మిస్డ్ కాల్ ద్వారా బంగారం ధర తెలుసుకోండి
మీరు మీ ఇంట్లో కూర్చొని బంగారం ధరను కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరను తనిఖీ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసే నంబర్‌కు మీ మెసేజ్ వస్తుంది. ఈ నంబర్ నుండి మీ నగరంలో ధర సమాచారాన్ని పొందిన తర్వాత మాత్రమే షాపింగ్ చేయండి.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు