ఐటి రిటర్నుల దాఖలు గడువు మరో నెల పెంపు

By telugu teamFirst Published Jul 24, 2019, 7:34 AM IST
Highlights

ఈ నెల 31వ తేదీలోగా ఐటి రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండగా, ఆగస్టు 31వ తేదీ వరకు గడువును పొడగించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటిఆర్) పత్రాల దాఖలు గడువును కేంద్రం ప్రభుత్వం మరో నెల పొడగించింది. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటిఆర్ పత్రాలను ఆగస్టు 31వ తేదీ వరకు సమర్పించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 

ఈ నెల 31వ తేదీలోగా ఐటి రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండగా, ఆగస్టు 31వ తేదీ వరకు గడువును పొడగించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

వ్యక్తులు, పన్నులు చెల్లించే ఉద్యోగులు, ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని సంస్థలకు ఐటిఆర్ లను దాఖలు చేయడానికి మొదట విధించిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. గడువు పొడగించాలనే డిమాండ్లు రావడంతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.

click me!