
మనదేశంలో అతి పెద్ద ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ లలో స్విగ్గీ ఒకటి. స్విగ్గీ ఇప్పుడు టోయింగ్ అనే కొత్త యాప్ ను లాంచ్ చేసింది. దీనిలో చాలా తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్ సేవలు ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో మంచి, నమ్మకమైన ఫుడ్ ఆర్డర్ చేయాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.
టోయింగ్ యాప్ లో ఆహారం రూ.100 నుంచి రూ.150 మధ్య ధరలో అందుబాటులో ఉండే ఫుడ్ ఆప్షన్లను అందిస్తుంది. ఈ యాప్‌ను ప్రత్యేకంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు, యువ ఉద్యోగుల కోసం రూపొందించారు. టోయింగ్ యాప్‌లో మినీ మీల్స్, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, కేకులు, స్వీట్లు రూ.12కే అందుబాటులో ఉన్నాయి. ప్రధాన స్విగ్గీ యాప్‌లో వీటి ధర రూ.14.99. ఇది కాకుండా, రూ.99 లోపు ఫ్లాష్ డీల్స్ కూడా ఉంటాయి.
పుణెలో విద్యార్థులు, యువ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ దీన్ని ప్రారంభించినట్లు స్విగ్గీ చెబుతోంది. ఇన్‌స్టామార్ట్, స్నాక్, డైన్‌అవుట్, క్రూ, పింగ్‌లతో కలిపి టోయింగ్ స్విగ్గీకి ఏడో యాప్. ఈ లాంచ్ సూపర్యా ప్ వ్యూహం నుంచి వేర్వేరు సేవల కోసం ప్రత్యేక యాప్‌లను కలిగి ఉండే సూపర్ బ్రాండ్ మోడల్‌కు స్విగ్గీ మారుతోందని సూచిస్తోంది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రమవుతున్న సమయంలో ఈ మార్పు వచ్చింది.
రాపిడో ఇటీవల ప్రారంభించిన 'ఓన్లీ' యాప్ ను ప్రారంభించింది. దానికి పోటీగా టోయింగ్ మొదలైంది. నివేదికల ప్రకారం, స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం మధ్య నెలవారీ లావాదేవీల వినియోగదారుల సంఖ్య 14 మిలియన్ల నుంచి 16.3 మిలియన్లకు పెరిగింది. కంపెనీ గతంలో 175 నగరాల్లో రూ.99 స్టోర్‌ను ప్రారంభించింది. రూ.49 నుంచి రూ.149 వరకు ఫుడ్ అందించింది. స్విగ్గీ ఇతర చౌక ధరల ఆప్షన్ల నుంచి టోయింగ్ భిన్నంగా ఉండటానికి కారణం, ఇది కేవలం రూ.100 నుంచి రూ.150 ధరల శ్రేణిపై మాత్రమే దృష్టి పెట్టడమే.