హైదరాబాద్, ఢీల్లీ, చెన్నైతో అన్నీ ప్రముఖ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Nov 27, 2020, 01:13 PM IST
హైదరాబాద్, ఢీల్లీ, చెన్నైతో అన్నీ ప్రముఖ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలు గత 48 రోజులుగా మారలేదు, నవంబర్ 20 (శుక్రవారం)నుండి ధరల సవరణ ప్రారంభమైంది. పెట్రోలియం కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ధరలను సావరిస్తాయి. ఈ నేపథ్యంలో ధరలు ఒక రోజు పెరగవచ్చు లేదా పడిపోవచ్చు. 

న్యూ ఢీల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థలు రెండు రోజుల విరామం తరువాత నేడు ఇంధన ధరలను మళ్ళీ పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు గత 48 రోజులుగా మారలేదు, నవంబర్ 20 (శుక్రవారం)నుండి ధరల సవరణ ప్రారంభమైంది. పెట్రోలియం కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ధరలను సావరిస్తాయి.

ఈ నేపథ్యంలో ధరలు ఒక రోజు పెరగవచ్చు లేదా పడిపోవచ్చు. శుక్రవారం (నవంబర్ 27) ఢీల్లీలో పెట్రోల్ ధరలను 19పైసలు పెంచి రూ .81.89 కు చేరగా, డీజిల్ ధరను 24 పైసలు పెరిగి లీటరుకు 71.86 రూపాయలకు పెంచారు.

వ్యాట్ బట్టి ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతాయి. రిటైల్ అమ్మకపు ధరలో దాదాపు మూడింట రెండు వంతుల వరకు పన్నులు ఉంటాయి.  

నవంబర్ 27న నాలుగు మెట్రో నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరల మారాయి. పెరిగిన ధరల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర 19 పైసల పెంపుతో లీటరుకు రూ.81.89 చేరుకోగా, డీజిల్ ధర 24 పైసల పెరుగుదలతో రూ.71.86 చేరుకుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.85.17 చేరింది, డీజిల్‌ను 26 పైసల పెంపుతో రూ.78.41 పెరిగింది.

also read బ్యాంకింగ్‌ సెక్టార్ పై నిపుణుల హెచ్చరిక.. ఆమోదానికి ముందు కఠినమైన పర్యవేక్షణ అవసరం.. ...

చెన్నైలో పెట్రోల్ ధర 26 పైసల పెంపుతో లీటరుకు రూ.85.00 చేరింది, డీజిల్ ధర రూ.31 పైసల పెంపుతో రూ.77.39 పెరిగింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర 18 పైసల పెంపుతో రూ.88.58 ఉండగా, డీజిల్ ధరలు 26 పైసల పెంపుతో రూ.78.38 పెరిగింది.

జూన్ నెల మధ్యకాలంలో డీజిల్ ధరలు లీటరుకు రూ.12.55 పెరిగాయి, లాక్ డౌన్ సడలింపుతో చమురు సంస్థలు ధరలకు అనుగుణంగా ధరలను సవరించడం జూలై 25 నుండి ప్రారంభించాయి.

జూన్ 7 నుండి జూన్ 29 మధ్య పెట్రోల్ ధర లీటరుకు 9.17 రూపాయలు పెరిగింది. మొత్తం మీద జూన్ 7 నుంచి పెట్రోల్ ధర రూ .10.68 పెరిగింది. యు.ఎస్. క్రూడ్ ఆయిల్ ధర 1.4% తగ్గి బ్యారెల్కు 45.07 డాలర్లకు చేరుకుంది.

అయితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.35% పెరిగి 47.79 డాలర్లకు చేరుకుందని ఒక నివేదిక తెలిపింది. పెట్రోలియం కంపెనీల ప్రకారం సవరించిన ఇంధన రేట్లు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.  

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే