భారత ఐటీ పితామహుడు కోహ్లీ ఇకలేరు..!

By team teluguFirst Published Nov 26, 2020, 9:09 PM IST
Highlights

ఐటీ దిగ్గ‌జం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వ్యవస్థాపకుడు, తొలి సీఈఓ, పద్మభూషణ్‌ ఫకీర్‌ చంద్‌ కోహ్లి  కన్నుమూశారు.

ప్రపంచంలో భార‌త్ ఇప్పుడు ఐటీకి కేర్ అఫ్ అడ్రస్. ఆ స్థాయిలో భారతదేశాన్ని సాఫ్ట్ వేర్ రంగంలో ముందుకు తీసుకెళ్లిన‌ ఐటీ దిగ్గ‌జం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వ్యవస్థాపకుడు, తొలి సీఈఓ, పద్మభూషణ్‌ ఫకీర్‌ చంద్‌ కోహ్లి  కన్నుమూశారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. 

100 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి  నాంది పలికిన ఎఫ్ సి కోహ్లిని "భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ పితామహుడు" అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతీయ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన కోహ్లీ మరణంపై సాఫ్ట్ వేర్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఐటీ రంగానికి కోహ్లీ చేసిన సేవలు ఎనలేనివని, దేశానికి  చెందిన అనేక తరాల ఐటీ నిపుణలు  కోహ్లికి రుణపడి ఉంటారంటూ యావత్ ఐటీ రంగం ఆయన మరణానికి సంతాపం ప్రకటించింది. 

ఎఫ్‌సీ కోహ్లీ 1924 మార్చి 19 న పూర్వపు బ్రిటిష్ ఇండియాలోని పెషావర్ లో జన్మించారు. అక్కడే పాఠశాల విద్యను అభ్యసించిన కోహ్లీ.... లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. 

స్వాతంత్య్రానంతరం భారతదేశంకి కోహ్లీ కుటుంబం వచ్చేసింది. 1950 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీజీ పూర్తి చేశారు. అదే సంవత్సరంలో భారతదేశానికి వచ్చి టాటా ఎలక్ట్రికల్స్ లో  చేరారు 

ఇక అక్కడినుండి ఆయన కెరీర్ దూసుకెళ్తూనే ఉంది. లాజిస్టిక్స్ మానేజ్మెంట్ విభాగాన్ని కోహ్లీ అక్ల్కడు చూసుకునేవారు. 1970 నాటికి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలకు ఆయన ఏకంగా డైరెక్టర్ అయ్యారు. 

1968, ఏప్రిల్‌ 1న జేఆర్డీ టాటాతో కలిసి కోహ్లీ టీసీఎస్‌ను స్థాపించారు. ముంబై కేంద్రంగా సేవలను అందిస్తూ కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచంలో మేటి ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్‌గా టీసీఎస్‌ అవతరించింది. 

1995-96 వరకు నాస్కామ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కోహ్లీ. ప్ర‌స్తుతం టీసీఎస్ కంపెనీకి ఛైర్మ‌న్‌గా న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్, సీఈవోగా రాజేష్ గోపినాథ‌న్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన మృతి టాటా సన్స్ గ్రూప్ నివాళులు అర్పించింది. 

click me!
Last Updated Nov 26, 2020, 9:09 PM IST
click me!