అక్టోబర్ 3న ఇంధన ధరలు: ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Oct 3, 2022, 8:26 AM IST
Highlights

సోమవారం మరోసారి గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 2.72 శాతం పెరిగి బ్యారెల్‌కు 87.46 డాలర్లకు చేరుకోగా,  US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు  81.62 డాలర్ల వద్ద ఉంది.

నేడు అక్టోబర్ 3న ఇండియాలోని ప్రముఖ మెట్రో నగరాల్లో పెట్రోల్ - డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72, , డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర   రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27కి విక్రయిస్తున్నారు. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.

సోమవారం మరోసారి గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 2.72 శాతం పెరిగి బ్యారెల్‌కు 87.46 డాలర్లకు చేరుకోగా,  US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు  81.62 డాలర్ల వద్ద ఉంది.

అలాగే, వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి అక్టోబర్ 25 నుండి దేశ రాజధానిలో పెట్రోల్ పంపుల వద్ద పియుసి (కాలుష్యం నియంత్రణ) సర్టిఫికేట్ లేకుండా పెట్రోల్ - డీజిల్ అందించకూడదని ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శనివారం తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

రాజస్థాన్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.0.51 పెరిగి రూ.108.58కి, డీజిల్‌  రూ.0.46 పెరిగి రూ.93.81కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.0.14 పెరిగి రూ.96.77కి చేరగా, డీజిల్‌పై రూ.0.13 పెరిగి రూ.89.93కి చేరుకుంది. మరోవైపు బీహార్‌లో పెట్రోల్ ధర రూ.0.36 తగ్గింది. ఇక్కడ పెట్రోలు కొత్త ధర లీటరుకు రూ.108.87 కాగా, డీజిల్ రూ.0.34 తగ్గడంతో రూ.95.54గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పెట్రోల్ - డీజిల్ ధరలను ఎలా చెక్ చేయాలి?
 ప్రతిరోజూ పెట్రోల్ - డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

ఈ విధంగా మీరు నేటి ధరలను
మీరు SMS ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

click me!