ఇంధన ధరల అప్ డేట్: నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకి ఎంతంటే..?

Published : Dec 20, 2022, 11:07 AM ISTUpdated : Dec 20, 2022, 11:21 AM IST
ఇంధన ధరల అప్ డేట్: నేడు హైదరాబాద్ లో  పెట్రోల్, డీజిల్ ధర లీటరుకి ఎంతంటే..?

సారాంశం

ఈరోజు భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ లాగానే పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దీంతో చాలా కాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు లేకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. 

నేడు డిసెంబర్ 20 మంగళవారం రోజున పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత ఏడు నెలలుగా ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు ఇంధన ధరలను సమీక్షిస్తాయి. గతంలో పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మే నెలలో ఇంధన ధరల్లో చివరిగా దేశవ్యాప్త హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరుకు పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్‌ ధర రూ. 89.62.

చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24.

ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79,  డీజిల్ ధర రూ. 89.96.

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76. 


 ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తాయి. OMCలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఉన్నాయి.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.

VAT వంటి స్థానిక పన్నులు, రాష్ట్రం నుండి రాష్ట్రానికి సరుకు రవాణా ఛార్జీలు వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి.

 అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు మళ్లీ 80 డాలర్లు దాటింది. అమెరికన్ క్రూడ్ బ్యారెల్కు $76 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధర పెరుగుదల వెనుక ఉన్న అతిపెద్ద కారణం చైనాలో కరోనా సంబంధిత పరిమితుల సడలింపు ఇంకా ప్రపంచంలో మాంద్యం ప్రభావం పరిమితం కావడం. 

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే