ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌తో ‘జియో సినిమా’ రికార్డు.. 3.2 కోట్ల మంది వీక్షణ

By Mahesh KFirst Published Dec 19, 2022, 6:25 PM IST
Highlights

ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి చాలా మంది జియోసినిమా ప్లాట్‌ఫామ్ ఎంచుకున్నారు. ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి ఒక్క ఆదివారం 3.2 కోట్ల మంది ‘జియో సినిమా’లో చూశారు. ఇది జియోసినిమాకు ఒక రికార్డు.
 

న్యూఢిల్లీ: ఖతర్‌లో జరిగిన 2020 ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. కానీ, జియో సినిమాకు డిజిటల్ వ్యూయర్షిప్‌లో ఇది ఒక కొత్త ఉదయం. తొలిసారి భారత్‌లో టెలివిజన్ వ్యూయర్షిప్‌ను జియో సినిమా అధిగమించింది. అర్జెంటినా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఆదివారం వీక్షించడానికి 3.2 కోట్ల మంది జియో సినిమాను ఎంచుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్‌ ద్వారా డిజిటల్ వ్యూయర్షిప్ మార్కెట్‌లో ఇండియా సరికొత్త స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ ఫిఫా వరల్డ్ కప్‌తో ఇండియాలోనూ ఫుట్ బాల్‌కు విశేష అభిమానులు ఏర్పడ్డారు. తద్వార మన దేశం నుంచి అభిమానులు డిజిటల్‌గా స్పోర్ట్స్ 18, జియో సినిమా ద్వారా 40 బిలియన్ నిమిషాల కంటెంట్‌ (ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు)ను చూశారు. అంతేకాదు, ఈ సీజన్‌లో ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లలో అన్నికంటే ఎక్కువగా జియోసినిమాను యాప్‌నే డౌన్‌లోడ్లు చేసుకున్నారు.

ఈ యాప్‌ డౌన్‌లోడ్లు పెరగడం భారత కన్జ్యూమర్లు స్పోర్టింగ్ యాక్షన్‌ను స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల్లో చూడటానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంకేతం ఇస్తున్నది. జియో సినిమా యూజర్లకు హైప్ మోడ్ ద్వారా మరింత మంచి వాచింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. లైవ్ కాంటెస్ట్ చూస్తూనే రియల్ టైమ్ స్టాట్స్, ట్రివియాలతోపాటు మల్టీ క్యామ్ వీక్షించే ఫీచర్లతో జియోసినిమా యూజర్ల(వీక్షకులను!)ను కట్టిపడేసింది.

Also Read: పాక్‌ ఇలా ఓడిపోతే వచ్చే కిక్కే వేరబ్బా... జింబాబ్వే- పాకిస్తాన్ మ్యాచ్‌కి రికార్డు వ్యూయర్‌షిప్...

ఓఈఎం, జియో ఎస్‌టీబీ, యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ స్టిక్, సోనీ, సామ్సంగ్, ఎల్జీ, షావోమీ, ఇతర సీటీవీ ప్లాట్‌ఫామ్‌లలో దీని అందుబాటు మూలంగా మంచి డిజిటల్ వ్యూయర్షిప్ వచ్చింది. 

ఈ బ్రాడ్‌క్యాస్ట్ సక్సెస్ గురించి వయకామ్ 18 స్పోర్ట్స్ సీఈవో అనిల్ జయరాజ్ మాట్లాడారు. ఫిఫా వరల్డ్ కప్‌ను కన్జ్యూమర్లకు ప్రపంచశ్రేణి ఫీచర్లు, క్వాలిటీతో అందించామని తెలిపారు. భారత్ పార్టిసిపేషన్ లేని భారతీయులు అత్యధికంగా డిజిటల్‌లో చూసిన టోర్నమెంట్ ఇదే అని వివరించారు. ఫ్యాన్స్ తమకు ఇష్టమైన ఈవెంట్లను తమ ప్రాధాన్యానికి అనుగుణంగా వీక్షించడానికి ఈ డిజిటల్ పవర్ ఉపకరిస్తున్నదని అర్థం అవుతున్నదని తెలిపారు. అంతేకాదు, జియోసినిమా, స్పోర్ట్స్ 18లో  ఫుట్‌బాల్ ఈవెంట్‌కు బ్రాండ్ పార్ట్‌నర్‌లుగా వ్యవహరించిన వారికీ మంచి స్పందన వస్తున్నట్టు తెలిసింది.

click me!