
రాష్ట్ర చమురు కంపెనీల పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా నేడు 9వ రోజు కూడా పెంచాయి. తాజా పెంపూతో ఇంధన ధరలు తార స్థాయికి చేరుకొని కొత్త రికార్డులను బద్దలు కొడుతున్నాయి. నేడు డీజిల్ ధర 24 నుంచి 26 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర 23 నుంచి 25 పైసలకు పెరిగింది.
ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకొని అల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో పెట్రోల్ అత్యధిక స్థాయిలో ఉంది. దీంతో ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .89.54 కు చేరుకోగా, ముంబైలో లీటరు పెట్రోల్ రూ .96 కు చేరుకుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి . దీంతో ప్రజలు వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి.
also read త్వరలో ఆ నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ.. ప్రభుత్వ కొత్త ప్రణాళిక ఏమిటో తెలుసుకోండి.. ...
నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 79.95 89.54
కోల్‌కతా 83.54 90.78
ముంబై 86.98 96.00
చెన్నై 85.01 91.68
హైదరాబాద్ 87.20 93.10
ఒక్క రాజస్థాన్ లోని గంగానగర్‌లో మాత్రం పెట్రోల్ ధర సెంచరీ దాటేసి రూ.100.13 చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు సమీక్షిస్తుంటారు. కొత్త ధరలను ఉదయం 6 నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ మరియు ఇతర వస్తువులను జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయింస్తాయి.