వరుసగా 261వ రోజు స్థిరంగా ఇంధన ధరలు.. నేడు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Feb 6, 2023, 9:18 AM IST
Highlights

ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
 

 నేడు వరుసగా 261వ రోజు సోమవారం అంటే ఫిబ్రవరి 6న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు . గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత,  మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.  

 తరువాత, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్, పై రూ. 5, డీజిల్‌ పై రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించింది.

ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు ఇంకా అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు:

లక్నో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నం లీటరు పెట్రోల్ ధర రూ.110.48,  డీజిల్ ధర రూ.98.27

 అహ్మదాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38

 హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

 పాట్నా లీటరు పెట్రోల్ ధర రూ.107.24, , డీజిల్ ధర రూ.94.04

click me!