కేంద్ర బడ్జెట్... స్టాక్ మార్కెట్లు కుదేలు

By telugu teamFirst Published Jul 5, 2019, 1:42 PM IST
Highlights

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పై పడింది. ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో.. అలా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పై పడింది. ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో.. అలా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 140 పాయింట్ల మేర నష్టపోగా... నిఫ్టీ సైతం మరోసారి 11,900 మార్కునకు దిగువన ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ... లోక్‌సభలో ఆర్ధిక మంత్రి 2019 ప్రసంగం తర్వాత ఇక పైకి వెళ్లలేదు.
 
మధ్యాహ్నానికి సెన్సెక్స్ కొద్దిగా కోలుకుని 71.56 పాయింట్ల నష్టంతో 39836.50 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 49.75 పాయింట్ల నష్టంతో 11897.00 వద్ద తచ్చాడుతోంది. మూలధన మార్కెట్ విధానాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రధానంగా ఎన్ఆర్ఐ పోర్టిఫోలియో పెట్టుబడులను విదేశీ పెట్టుబడులతో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. లిస్టెడ్ కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా పెంచేందుకు ఇదే సరైన సమయమనీ.. దీన్ని 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని సెబీని కోరానని ఆర్థికమంత్రి వెల్లడించారు.

click me!