Flipkart UPI : సొంతంగా UPIని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. దీనిని ఎలా వాడాలంటే, పూర్తి వివరాలివే

By Siva Kodati  |  First Published Mar 3, 2024, 7:40 PM IST

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ .. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించింది. ఈ సేవను ‘‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’’ అని పిలుస్తారు. సూపర్‌కాయిన్‌లు, బ్రాండ్ వోచర్‌లు, ఇతరత్రా వంటి అనేక రివార్డ్‌లు, ప్రయోజనాలను కూడా అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 


డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలోకి బడా కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే సహా పలు సంస్థలు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. తాజాగా దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ .. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించింది. ఈ సేవను ‘‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’’ అని పిలుస్తారు. ఈ కామర్స్ కంపెనీలు తమ కస్టమర్‌లకు మెరుగైన సేవలు అందించేందుకు , చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్‌లకు దారి మళ్లించకుండా వుండటానికి సొంత యూపీఐ హ్యాండిల్‌లపై ఫోకస్ పెట్టాయి. ఈ దశలో ఫ్లిప్‌కార్ట్ కూడా సొంతంగా యూపీఐని ప్రారంభించడం విశేషం.

ఫ్లిప్‌కార్ట్‌లోని ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనేజా మాట్లాడుతూ.. సురక్షితమైన , అనుకూలమైన చెల్లింపుతో పాటు సురక్షితమైన, అనుకూలమైన చెల్లింపు ఎంపికలను అందించడం ద్వారా కస్టమర్‌లకు బెస్ట్ కేటగిరీ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి తాము కట్టుబడి వున్నామన్నారు. అలాగే సూపర్‌కాయిన్‌లు, బ్రాండ్ వోచర్‌లు, ఇతరత్రా వంటి అనేక రివార్డ్‌లు, ప్రయోజనాలను కూడా అందిస్తామని అనేజా పేర్కొన్నారు. 

Latest Videos

Flipkart UPI అందించే సేవలు.. అసలు ఇది ఎలా పనిచేస్తుంది :

1. ఫ్లిప్‌కార్ట్ యాప్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం తొలుత ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో వుంటుంది.

2. ఫ్లిప్‌కార్ట్ యూపీఐని ఉపయోగించడానికి వ్యక్తులు ముందుగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ యాప్‌లను మార్చకుండానే బిల్లులు చెల్లించడంతో పాటు వ్యాపారులు, వ్యక్తులకు చెల్లింపులు చేయవచ్చు.

3. మైంత్రా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ , క్లియర్ ట్రిప్‌తో సహా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

4. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ.. అమెజాన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

5. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. దాని మార్కెట్ ప్లేస్‌లో రూ.50 కోట్లకు పైగా ఎక్కువ నమోదిత వినియోగదారులు, 14 లక్షల మంది విక్రేతలు వున్నారు. దీనికి అదనంగా ఫిబ్రవరిలో మొత్తం విలువ రూ.18.3 కోట్లకు చేరగా.. 1210 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 61 శాతం పెరుగుదల. 

click me!