మళ్ళీ ఆకాశానికి బంగారం ధరలు.. నేడు ఒక్కరోజే తులం ఎంత పెరిగిందంటే..?

By Ashok kumar Sandra  |  First Published Mar 2, 2024, 9:49 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, దాదాపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000కి,  సుమారు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000కి చేరువయ్యాయి. 


దేశ రాజధాని ఢిల్లీలో  ఇవాళ  బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,060, 24 క్యారెట్ల పది గ్రాముల ధర  రూ. 10 పతనంతో రూ. 63,320. ఢిల్లీ నగరంలో వెండి ధర కిలోకు రూ. 74,600.

నేడు 02 మార్చి, 2024న హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 330  పెరిగి రూ.57,910 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 340  పెంపుతో రూ. 63,170గా ఉంది.  వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 76,300.

Latest Videos

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, దాదాపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000కి,  సుమారు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000కి చేరువయ్యాయి. 

ఇక  విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 పెంపుతో  రూ. 57,910 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 340 పెంపుతో రూ. 63,170.  వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.76,300.

విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరల పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,910,  24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,170. ఇక్కడ వెండి ధర కిలోకు రూ. 76,100.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎప్పుడైనా  ధరలు మారవచ్చు.  అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

click me!