కారణమిదీ:మార్చి 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్

By narsimha lode  |  First Published Mar 1, 2024, 3:03 PM IST


ఈ నెల 2వ తేదీన  బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు  ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ ను నిర్వహించనున్నాయి.  


న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ) లు ఈ నెల 2వ తేదీన (శనివారం)  రెండు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ లను నిర్వహించనున్నాయి.మార్చి  2న  ఉదయం 09:15 గంటలకు  తొలి సెషన్ ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం  11:30 గంటలకు ప్రారంభమై 12:30 గంటలకు రెండో సెషన్ ముగుస్తుంది.

ప్రైమరీ సైట్ నుండి డిజాస్టర్ రికవరీ సైట్ కు ఇంట్రా-డే స్విచ్ ఓవర్ తో ఎక్చేంజ్ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ ను నిర్వహిస్తున్న  విషయాన్ని గమనించాలని  నిర్వాహకులు సూచించారని హిందూస్తాన్ టైమ్స్  పత్రిక కథనం తెలిపింది.ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ యొక్క తొలి విడత ఉదయం 09:15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సెషన్ 10 గంటలకు ఎన్ఎస్ఈ వెబ్ సైట్ లో ముగియనుంది. ఆ తర్వాత లైవ్ ట్రేడింగ్ సెషన్ రెండో భాగం స్టాక్ మార్కెట్ ఎక్చేంజ్ రికవరీ సైట్ లో సాగుతుంది.

Latest Videos

సాధారణంగా  శనివారం నాడు స్టాక్ మార్కెట్ కు సెలవు. కానీ, విపత్తు సంభవించినప్పుడు వ్యాపార కొనసాగింపునకు ఇబ్బందులు లేకుండా  ఉండేందుకు గాను  మార్చి 2న ప్రత్యక్ష ట్రేడింగ్  ఉంటుందని  ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి.

అత్యవసర పరిస్థితుల్లో ట్రేడింగ్ నిరంతరాయంగా కొనసాగుతుందని హామీ ఇస్తుంది. లైవ్ ట్రేడింగ్ ప్రత్యేక సెషన్ సమయంలో హెచ్చు తగ్గుదలకు లోబడి అన్ని భవిష్యత్తు ఒప్పందాలుంటాయి.నిర్వహణ పరిధి ఐదు శాతం. అదనంగా ఫ్యూచర్, ఆఫ్షన్స్ విభాగంలోని సెక్యూరిటీల కోసం ఎగువ, దిగువ పరిమితులకు ఐదు శాతం బ్యాండ్ ఉంటుంది.

డిజాస్టర్ రికవరీ సైట్ (డీఆర్ఎస్), స్టాక్ ఎక్చేంజీలు, డిపాజిట్ల కోసం వ్యాపార కొనసాగింపు ప్రణాళిక (బీసీపీ) కోసం ఫ్రేమ్ వర్క్ లో భాగంగా  సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఈబీఐ) ఏర్పాటు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు.ఈ లైవ్ సెషన్ నేపథ్యంలో  ఈ శనివారం నాడు  స్టాక్ మార్కెట్ కు సెలవు లేదు.

మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కోరినట్టుగా ఊహించని విపత్తు సంభవించినప్పుడు విపత్తు పునరుద్దరణ సైట్ లలో వ్యాపార కొనసాగింపు ప్రణాళిక సాఫీగా మారేలా చేసేందుకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక ట్రేడింగ్ ను నిర్వహిస్తున్నాయి

click me!