టీవీలపై 70% ఆఫర్: ఫ్లిప్‌కార్ట్ ‘ఇయర్ ఎండ్ కార్నివాల్’ షురూ

sivanagaprasad kodati |  
Published : Dec 23, 2018, 11:54 AM IST
టీవీలపై 70% ఆఫర్: ఫ్లిప్‌కార్ట్ ‘ఇయర్ ఎండ్ కార్నివాల్’ షురూ

సారాంశం

ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చేసింది. టీవీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఆదివారం నుంచి వచ్చే సోమవారం వరకు ఈ ఆఫర్లు అమలులో ఉంటాయి. 

దేశవ్యాప్తంగా చలికాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కానీ ఈ-కామర్స్ రిటైల్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ మాత్రం సంవత్సరం ముగింపు సందర్భంగా వినియోగదారులకు గ్రుహోపకరణాలు, ఇతర వస్తువులపై భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది.

‘ఇయర్ ఎండ్ కార్నివాల్’ పేరిట ఫ్లిప్ కార్ట్ తీసుకువచ్చిన అద్భుతమైన ఈ ఆఫర్లు ఈ నెల 23వ తేదీ (ఆదివారం) నుంచి ఈ నెలాఖరు వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 

టెలివిజన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోళ్లపై ఫ్లిప్ కార్ట్ 70 శాతం వరకు ఆపర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నది. తొమ్మిది రోజుల పాటు అందుబాటులో ఉండే బెస్ట్ ఆఫర్లలో కొన్నిచూద్దాం:

* 32 అంగుళాల శామ్‌సంగ్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర రూ.26,900 నుంచి రూ.16,000.

* 43 అంగుళాల వు ఐకానియం 4కే స్మార్ట్ టీవీ రూ.24,999లకు లభ్యం. 

* 260 లీటర్ల ఎల్జీ ఎల్ ఫ్రొస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.30,690 నుంచి రూ.22,490లకు తగ్గింపు.

* మిడియా 1 టొన్ 3 స్టార్ 2018 ఇన్వర్టర్ ఏసీ ధర రూ.37 వేల నుంచి రూ.21,999లకు లభ్యత. 

* 30 లీటర్ల మొర్ఫీ రిచర్డ్స్ కన్విక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ రూ.8999లకే లభ్యత. 

అదనంగా ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం, ఫర్నీచర్ ఉత్పత్తులపై 80 శాతం ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ కార్డు వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది. 

పుమా, అదిదాస్, టైటాన్, బాంబే డయింగ్‌లపై విస్త్రుత శ్రేణి రాయితీలు కల్పిస్తోంది. మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హెల్త్ కేర్, వినియోగదారులకు ఇష్టమైన వస్త్రాలు తదితర ఉత్పత్తులపైనా రాయితీలు కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. 

PREV
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్