తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు

By Sandra Ashok KumarFirst Published Mar 8, 2020, 11:55 AM IST
Highlights

 ఆర్ధిక మంత్రిగా హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్.

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ 2020-21ను ఆర్థిక శాఖ మంత్రి తానిరు హరీష్‌రావు ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రిగా హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

also read  మరికాసేపట్లో 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్. వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన చేశారు. రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద రాసే అంకెలు కాదు అని హరీష్ రావు అన్నారు.

కేంద్రం నుంచి రాష్ర్టనికి రావాల్సిన పన్నుల వాటా తగ్గింది అని  తెలిపారు.  దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించి కేసీఆర్ సారథ్యంలో ప్రగతిశీల రాష్ర్టంగా ముందుకెళ్తుంది అని అన్నారు. మన రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువ అని వ్యవసాయరంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది అని చెప్పారు.

also read  కొత్త చట్టాల అమలుతో నేడు 11:30కి తెలంగాణ బడ్జెట్

రూ.25వేల రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీని ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుంది. రైతు బీమా కోసం రూ.1150 కోట్లు, రైతు రుణమాఫీలకు రూ. 6225 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు అన్నారు.  

ఏ కారణంతో  అయిన రైతు మరణించినా వారికి రూ. 5లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. పాడి పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది, రైతుల నుంచి సేకరించే పాలకు లీటరకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తోంది ప్రభుత్వం. పాడిపరిశ్రమల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు  మంత్రి హరీష్ రావు తెలిపారు.
 

click me!