Multibagger stock: బాలకృష్ణ ఇండస్ట్రీస్‌లో 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 1.64 కోట్లు మీ సొంతం..దబిడి దిబిడే

Published : Mar 17, 2022, 04:20 PM IST
Multibagger stock: బాలకృష్ణ ఇండస్ట్రీస్‌లో 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 1.64 కోట్లు మీ సొంతం..దబిడి దిబిడే

సారాంశం

స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుంటారు. ఒక్క మల్టీ బ్యాగర్ స్టాక్ మీ పోర్ట్ ఫోలియోలో తగిలిందంటే చాలు. అది మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్టర్లలో చాలా మంది బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి చాలా మందే విని ఉంటారు. ఈ స్టాక్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది.   

Balkrishna Industries Limited: స్టాక్ మార్కెట్లు పతనం నుంచి కోలుకొని రికవరీ బాటపట్టాయి. అయితే మల్టీ బ్యాగర్లపై మాత్రం ఇన్వెస్టర్ల గురి మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో తమ డబ్బుును అత్యధిక మొత్తంలో రిటర్న్ గా పొందుతుంటారు. అయితే ప్రస్తుతం ఒక స్టాక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టాక్ గడిచిన 13 సంవత్సరాల క్రితం ఒక లక్ష పెట్టుబడిని దాదాపు 1.64  కోట్లుగా మార్చేసింది. ఆ స్టాక్ పేరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ (Balkrishna Industries) ఈ స్టాక్  తన ఇన్వెస్టర్లకు బంపర్ రాబడిని ఇచ్చింది.

కంపెనీ షేర్లు 16,320 శాతం పెరిగాయి
గత 13 ఏళ్లలో ఈ కంపెనీ షేరు రూ.12.18 నుంచి 2053 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో కంపెనీ స్టాక్ 16,320 శాతానికి పైగా పెరిగింది.  గత 6 నెలల నుంచి ఈ స్టాక్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత 6 నెలల్లో ఈ షేరు 20 శాతం క్షీణించింది, అయితే ఇయర్-టు-డేట్ (YTD) సమయంలో అంటే 2022లో, బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ధర దాదాపు రూ. 2327 నుండి రూ. 2000కి పడిపోయింది. ఈ గ్యాపులో స్టాక్ దాదాపు 14 శాతం నష్టాన్ని చవిచూసింది.

ఐదేళ్లలో షేర్లు 185% పెరిగాయి
గత ఏడాదిలో, ఈ స్టాక్ ఒక్కో షేరుకు దాదాపు రూ.1640 నుండి రూ.2000 వరకు పెరిగింది. ఈ కాలంలో స్టాక్ దాదాపు 22 శాతం వృద్ధిని సాధించింది. గత 5 సంవత్సరాలలో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ సుమారు రూ. 700 నుండి రూ.2000 స్థాయికి పెరిగింది. ఈ సమయంలో, స్టాక్ దాదాపు 185 శాతం పెరిగింది.

ఈరోజు స్టాక్ 2053 స్థాయి వద్ద ముగిసింది
అదేవిధంగా, గత 10 సంవత్సరాలలో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.125 నుండి రూ.2000 స్థాయికి పెరిగింది. ఈ సమయంలో, స్టాక్ దాదాపు 1500 శాతం పెరిగింది. అయితే, గత 13 సంవత్సరాలలో, గత 13 సంవత్సరాలలో స్టాక్ రూ.12.18 (NSE 13 మార్చి 2009) నుండి రూ.2,053కి (NSEలో 16 మార్చి 2022న ముగింపు ధర)కి పెరిగింది, అంటే దాదాపు 164 రెట్లు పెరిగింది.

1 లక్షకు 16 లక్షల రిటర్న్..
ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్‌లో  1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతని  1 లక్ష  80 వేలకు క్షీణించేది. కానీ  గత సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1.22 లక్షలు అయి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు గత 5 సంవత్సరాలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతని డబ్బు నేడు రూ. 2.85 లక్షలు అవుతుంది. అదే విధంగా, ఒక పెట్టుబడిదారుడు గత 10 సంవత్సరాలలో ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అది నేడు రూ. 16 లక్షలు అవుతుంది.

1 లక్ష 13 ఏళ్లలో 1.64 కోట్ల రిటర్న్..
అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు 13 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, అతని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 1.64 కోట్లుగా మారి ఉండేది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్